logo

Suicide: జుట్టు ఊడిపోవడంతో మహిళ ఆత్మహత్య

కురులంటే ఆమెకు పంచప్రాణాలు.. ఎన్నెన్నో షాంపూలు, నూనెలతో కంటికిరెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. ఇటీవల ఓ వింత జబ్బు కారణంగా తల వెంట్రుకలు రాలడం ఆరంభమైంది. ఎన్ని చికిత్సలు చేయించుకున్నా ఫలితం లేకపోవడంతో జీవితంపై 

Updated : 03 Jul 2022 09:00 IST

మైసూరు, న్యూస్‌టుడే: కురులంటే ఆమెకు పంచప్రాణాలు.. ఎన్నెన్నో షాంపూలు, నూనెలతో కంటికిరెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. ఇటీవల ఓ వింత జబ్బు కారణంగా తల వెంట్రుకలు రాలడం ఆరంభమైంది. ఎన్ని చికిత్సలు చేయించుకున్నా ఫలితం లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ దుర్ఘటన మైసూరు నగరంలోని రాఘవేంద్ర ఎక్స్‌టెన్షన్‌లో చోటుచేసుకున్నట్లు పోలీసు అధికారులు శనివారం తెలిపారు. మృతురాలిని కావ్యశ్రీ (21)గా గుర్తించారు. వింత జబ్బు కారణంగా తల వెంట్రుకలు పూర్తిగా రాలిపోవడంతోనే ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. నజరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని