logo

బాలుడి అపహరణ కథ సుఖాంతం

విజయనగర జిల్లా హగిరిబొమ్మన హళ్లి బాలుడు అద్విక్‌(5) అపహరణ కథ సుఖాంతమైంది. ఆదివారం రాత్రి పోలీసులు కిడ్నాపర్ల చెర నుంచి బాలుడిని సంరక్షించి తీసుకొచ్చారు. ఉదయం ఇంటి వద్ద ఓ మైదానంలో ఆటలాడుతున్న అద్విక్‌ అనే బాలుడిని

Published : 05 Jul 2022 02:59 IST

అపహరణకు గురైన బాలుడు అద్విక్‌ను తల్లి ఒడికి చేర్చిన ఎస్సై సరళ

హొసపేటె, న్యూస్‌టుడే: విజయనగర జిల్లా హగిరిబొమ్మన హళ్లి బాలుడు అద్విక్‌(5) అపహరణ కథ సుఖాంతమైంది. ఆదివారం రాత్రి పోలీసులు కిడ్నాపర్ల చెర నుంచి బాలుడిని సంరక్షించి తీసుకొచ్చారు. ఉదయం ఇంటి వద్ద ఓ మైదానంలో ఆటలాడుతున్న అద్విక్‌ అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. అనంతరం బాలుడి తండ్రి రాఘవేంద్రకు ఫోను చేసి రూ.3లక్షలు ఇస్తే నీ కొడుకును విడిచి పెడతామని చరవాణిలో డిమాండ్‌ చేశారు. తన కొడుకు అపహరణకు గురైన విషయాన్ని ఆయన హగరిబొమ్మన హళ్లి పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. కూడ్లిగి డీఎస్పీ హరీష్‌, సీఐ మంజణ్ణ, ఎస్సై సరళ కూపీలాగి బాలుడిని ఉలువత్తి గ్రామ శివారులో దాచిపెట్టినట్లు గుర్తించారు. బాలుడి తల్లిదండ్రులు డబ్బుతో కిడ్నాపర్లు చెప్పిన స్థలానికి వెళ్లారు. కిడ్నాపర్లకు డబ్బు ఇస్తుండగా మారువేషంలో అక్కడ కాపుకాచిన పోలీసులు వస్తున్నారని తెలియగానే బాలుడిని వీడి చీకట్లో పరారయ్యారు. పోలీసులు బాలుడిని సంరక్షించి తల్లి ఒడికి చేర్చారు. సకాలంలో బాలుడిని రక్షించిన పోలీసు అధికారులను విజయనగర ఎస్పీ డాక్టర్‌ కె.అరుణ్‌ అభినందించారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని