logo

బెంగళూరు జిల్లాధికారి మంజునాథ్‌ అరెస్టు

కర్ణాటక రాజధాని బెంగళూరు శివారు ఆనేకల్‌ సమీపంలోని కూడ్లు గ్రామంలో 38 గుంటల భూవ్యవహారాన్ని పరిష్కరించేందుకు రూ.15 లక్షల లంచం డిమాండ్‌ చేసి- బయానాగా ఉప తహసీల్దారు మహేశ్‌ ద్వారా రూ.5 లక్షలు తీసుకున్న ఆరోపణలు

Published : 05 Jul 2022 02:59 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : కర్ణాటక రాజధాని బెంగళూరు శివారు ఆనేకల్‌ సమీపంలోని కూడ్లు గ్రామంలో 38 గుంటల భూవ్యవహారాన్ని పరిష్కరించేందుకు రూ.15 లక్షల లంచం డిమాండ్‌ చేసి- బయానాగా ఉప తహసీల్దారు మహేశ్‌ ద్వారా రూ.5 లక్షలు తీసుకున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగళూరు నగర జిల్లాధికారి (కలెక్టర్‌) జె.మంజునాథ్‌ను అవినీతి నియంత్రణ దళం (అనిద) అధికారులు అరెస్టు చేశారు. చేతన్‌ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకుంటున్న మహేశ్‌ను మే 21న అనిద అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. జిల్లాధికారి సూచనలతోనే తాను నగదు తీసుకున్నానని ఉప తహసీˆల్దారు చెప్పడంతో మంజునాథ్‌ను అనిద అధికారులు రెండుసార్లు ప్రశ్నించారు. మంజునాథ్‌ను సోమవారం సాయంత్రం అరెస్టు చేశామని అనిద అధికారులు ప్రకటించారు. ఎస్సై పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ప్రశ్న పత్రం కేసులో ఏడీజీపీ అమృత్‌పాల్‌ కూడా సోమవారమే అరెస్టయిన కొంత సమయానికే ఐఏఎస్‌ అధికారి ఒకరు అరెస్టు కావడం కర్ణాటకలో సంచలనానికి కారణమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని