logo

సిని.. అందాల రాణి!

ఫెమినా మిస్‌ ఇండియా 2022 విజేతగా ఉడుపికి చెందిన సినిశెట్టి ఎంపికయ్యారు. ముంబయిలో జరిగిన ఈ పోటీల్లో విజేతల సమాచారాన్ని ఆదవారం తన అధికారిక సామాజిక మాధ్యమంలో నిర్వాహక సంస్థ ప్రకటించింది. ఈ పోటీల్లో మొదటి రన్నరప్‌గా

Published : 05 Jul 2022 02:59 IST

ఫెమినా మిస్‌ ఇండియా విజేత (మధ్యలో) సిని శెట్టి. చెరోవైపున రుబాల్‌ షెకావత్‌, షినాతా చౌహాన్‌

ఉడుపి, న్యూస్‌టుడే : ఫెమినా మిస్‌ ఇండియా 2022 విజేతగా ఉడుపికి చెందిన సినిశెట్టి ఎంపికయ్యారు. ముంబయిలో జరిగిన ఈ పోటీల్లో విజేతల సమాచారాన్ని ఆదవారం తన అధికారిక సామాజిక మాధ్యమంలో నిర్వాహక సంస్థ ప్రకటించింది. ఈ పోటీల్లో మొదటి రన్నరప్‌గా రుబాల్‌ షెకావత్‌, రెండో రన్నరప్‌గా షినాతా చౌహాన్‌ నిలిచారు. ఉడుపి ప్రాంతానికి చెందిన సిని శెట్టి కుటుంబం ముంబయిలోనే స్థిరపడింది. ఆమె అక్కడే జన్మించారు కూడా. అకౌంట్స్‌, ఫైనాన్స్‌ విభాగంలో స్నాతకోత్తర విద్య పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె చార్టెడ్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌ కోర్సును చేస్తున్నారు. చదువుతో పాటు భరతనాట్యం, ఇతర శైలి నృత్యాల పట్ల కూడా ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. నాలుగో ఏట నుంచే నాట్య ప్రదర్శనలో ఆసక్తిని వ్యక్తం చేయడంతో పాటు తగిన శిక్షణ కూడా పొందారు. అనేక నృత్యప్రదర్శనల్ని కూడా ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని