logo

తుపాకీతో బెదిరించి బంగారం దోపిడీ

ఆభరణాలు కొనే నెపంతో వచ్చిన నలుగురు దుండగులు.. దుకాణంలో ఉద్యోగిని తుపాకీతో బెదిరించి మూడున్నర కిలోల నగలు, వెండి వస్తువులతో పరారయ్యారు. మైలసంద్రలోని రామ్‌దేవ్‌ బ్యాంకర్స్‌ అండ్‌ జ్యువెలర్స్‌లో సోమవారం

Published : 05 Jul 2022 02:59 IST

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : ఆభరణాలు కొనే నెపంతో వచ్చిన నలుగురు దుండగులు.. దుకాణంలో ఉద్యోగిని తుపాకీతో బెదిరించి మూడున్నర కిలోల నగలు, వెండి వస్తువులతో పరారయ్యారు. మైలసంద్రలోని రామ్‌దేవ్‌ బ్యాంకర్స్‌ అండ్‌ జ్యువెలర్స్‌లో సోమవారం ఉదయం ఈ దోపిడీ జరిగింది. నిందితులు రూ.1.93 కోట్ల విలువైన ఆభరణాలు, వస్తువులను దోచుకున్నారని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఎలక్ట్రానిక్‌ సిటీ పోలీసుల కథనం మేరకు.. బోవర్‌లాల్‌ అనే వ్యక్తి ఈ దుకాణం యజమాని. ఆభరణాలు తాకట్టు పెట్టుకుని రుణాలు ఇవ్వడం, వినియోగదారులు ఇచ్చిన ఆర్డరుకు అనుగుణంగా ఆభరణాలను తయారు చేసి ఇచ్చే వ్యాపారంలో ఉన్నారు. సోమవారం ఉదయం 7.30కు బోవర్‌లాల్‌ బంధువు ధర్మేంద్ర దుకాణాన్ని తెరిచారు. మొదట ఇద్దరు మహిళలు వచ్చి నగలు కొనుగోలు చేయాలని చెప్పారు. వారితో ధర్మేంద్ర మాట్లాడుతున్నంతలోనే మరో ఇద్దరు యువకులు అక్కడికి వచ్చారు. తుపాకీ చూపించి అతన్ని బెదిరించి, కాళ్లు, చేతులు కట్టేశారు. లాకర్‌లో ఉన్న మూడున్నర కిలోల ఆభరణాలు, 30 కిలోల వెండి వస్తువులు, 80 కిలోల నగదును తమతో తెచ్చుకున్న సంచుల్లో నింపుకొని పరారయ్యారు. అనంతరం తన కట్లు విడిపించుకున్న బాధితుడు బోవర్‌లాల్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందజేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని