logo

రాజమార్గానికి తొలి మెరుగులు

బెంగళూరు- మైసూరు మధ్య పది వరుసల రాజ మార్గ పనుల మొదటి దశ పూర్తయింది. బెంగళూరు నుంచి నిడఘట్ట వరకు పూర్తయిన మార్గంలో వాహనాలను అనుమతించాలని జాతీయ రహదారుల ప్రాధికార అధికారులు యోచిస్తున్నారు.

Published : 05 Jul 2022 02:59 IST

మైసూరు మార్గంలో కొనసాగుతున్న వంతెన పనులు

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : బెంగళూరు- మైసూరు మధ్య పది వరుసల రాజ మార్గ పనుల మొదటి దశ పూర్తయింది. బెంగళూరు నుంచి నిడఘట్ట వరకు పూర్తయిన మార్గంలో వాహనాలను అనుమతించాలని జాతీయ రహదారుల ప్రాధికార అధికారులు యోచిస్తున్నారు. మిగిలిన మార్గాన్ని అక్టోబరులో దసరా పండుగ సమయానికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బెంగళూరు నుంచి మైసూరుకు వెళ్లేందుకు ఇప్పుడు సుమారు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది. రూ.8.172 కోట్ల ఖర్చుతో 118 కి.మీ. పొడవునా నిర్మిస్తున్న పది మార్గాల రహదారి పూర్తయితే ఉద్యాననగరి నుంచి రాచనగరి మధ్య ప్రయాణించేందుకు గంటన్నర సమయం (90 నిమిషాలు) సరిపోతుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌ హైవేలో తొమ్మిది పెద్ద వంతెనలు, 64 బిల మార్గాలు, 11 ఓవర్‌ పాస్‌, రైల్వే వంతెనలు, ఐదు బైపాస్‌లు ఉంటాయి. ఈ రహదారిలో 99 శాతం రామనగర, మండ్య జిల్లాల్లో నుంచి వెళ్లనుంది. ఈ ప్రాజెక్టును 2014లో ప్రారంభించినప్పుడు అంచనా వ్యయం రూ.4,100 కాగా, పూర్తయ్యే సమయానికి రెట్టింపు అయింది.

రైల్వే ట్రాక్‌ వద్ద కొనసాగుతున్న నిర్మాణాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని