logo
Published : 06 Aug 2022 02:06 IST

హస్తినకు బొమ్మై

ఈనాడు, బెంగళూరు : ముఖ్యమంత్రి హోదాలో బసవరాజ బొమ్మై 13వ సారి దిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రాజకీయ, పాలన పరమైన వ్యవహారాలతో ఏడాదిలో దాదాపు ప్రతి నెలా ఆయన హస్తిన బాట పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 11:30 గంటలకు దిల్లీకి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు అక్కడికి చేరుకునే ముఖ్యమంత్రి సాయంత్రం 4:30 గంటలకు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ జాతీయ సమితి సమావేశంలో పాల్గొంటారు. ఆరోజు దిల్లీలోనే ఉంటారు. ఆదివారం నీతి ఆయోగ్‌ పాలక మండలి ఏడో సమావేశంలో పాల్గొంటారు. ఉదయం 9:45 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఈ సమావేశం కొనసాగుతుంది. రాత్రి 8:40 గంటలకు బెంగళూరుకు తిరుగు పయనమవుతారు.
ః పర్యటనలో భాగంగా భాజపా పెద్దలతో చర్చించేందుకు బొమ్మై సమయాన్ని కోరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. గురువారం బెంగళూరుకు వచ్చిన అమిత్‌ షాతో రాజకీయాల కంటే శాంతి భద్రతల అంశాలపైనే ఎక్కువగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ అంశాన్ని ప్రస్తావించలేక పోయారు. శని, ఆదివారాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రత్యేకంగా చర్చిస్తారు. ఏడాదిగా మూలుగుతున్న ‘విస్తరణ’ అంశంపై చర్చిస్తానని ముఖ్యమంత్రి శుక్రవారం తెలిపారు. మంత్రివర్గంలో చేర్పించుకునే వారి వివరాలను ఇప్పటికే అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. ఈనెల 15లోగా విస్తరణ ప్రక్రియను ముగించి ఆ రోజున పూర్తి స్థాయి మంత్రివర్గ సభ్యులతో 75వ స్వాతంత్య్ర దినోత్సవ ఆచరణ చేపట్టాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యం. ఈ క్రమంలో శుభవార్త వినాలని పలువురు ఆశావహులు శుక్రవారమే ఆర్‌టీ నగరంలోని సీఎం నివాసానికి చేరుకున్నారు. అశ్లీల సీడీ వ్యవహారంతో రాజీనామా చేసిన రమేశ్‌ జార్ఖిహొళి, 40 శాతం కమీషన్‌ వ్యవహారంలో రాజీనామా చేసిన కేఎస్‌ ఈశ్వరప్ప మంత్రివర్గంలో పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రక్షాళనకు కూడా అవకాశం ఉంటే కొత్త ముఖాలకు చోటు ఖాయంగా కనిపిస్తోంది.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని