logo
Published : 08 Aug 2022 01:45 IST

లోక్‌సభ బరిలో కొత్త ముఖాలు

కమలదళం యోచన

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: లోక్‌సభకు 2024లో జరిగే ఎన్నికల్లో ఎక్కువ శాతం కొత్త వారికే టిక్కెట్టు ఇవ్వాలని కమలనాథులు యోచిస్తున్నారు. ఇప్పటికే 70 ఏళ్లకు చేరుకున్న లోక్‌సభ సభ్యుల స్థానంలో యువతకు పెద్దపీట వేయాలని కేంద్ర కార్యవర్గ సమితి పార్టీ జాతీయ నాయకత్వానికి సిఫార్సు చేసింది. కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాల్లో 25 స్థానాల్లో భాజపా సభ్యులు ఉన్నారు. ఏడాదిన్నర తర్వాత జరిగే ఎన్నికల్లో కనీసం 8-10 కొత్త ముఖాలకు లోక్‌సభకు పోటీ చేసే అవకాశాన్ని కల్పించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలుగా, వివిధ మోర్చాల ప్రతినిధులుగా, జిల్లాలకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న నేతల నుంచి కొత్త సభ్యుల ఎంపిక ఉంటుందని అంచనా. డి.వి.సదానందగౌడ (బెంగళూరు ఉత్తర), కె.పి.బచ్చేగౌడ (చిక్కబళ్లాపుర), జి.ఎం.బసవరాజ్‌ (తుమకూరు), వి.శ్రీనివాస ప్రసాద్‌ (చామరాజనగర), పి.సి.గద్దిగౌడర్‌ (బాగలకోట), రమేశ్‌ జిగజిణగి (విజయపుర), తదితరులకు ఈసారి ఎన్నికలకు టిక్కెట్టు నిరాకరించి, పార్టీ సేవలకు వారిని వినియోగించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో యువకులు, కొత్త వారు, కుల ప్రాధాన్యం, ప్రజాదరణ, పారదర్శకత, విద్య, ఉత్తమ ప్రవర్తన తదితరాలను కొలమానాలుగా తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతలను పార్టీ అనుబంధ సంస్థలకు అప్పగించారు.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని