logo
Published : 08 Aug 2022 01:45 IST

సవారీకి సై..సై

పూజలు అందుక్ను ఏనుగులతో మంత్రులు, అధికారులు

మైసూరు, న్యూస్‌టుడే: విఖ్యాత దసరా ఉత్సవాలు, జంబూ సవారీలో పాల్గొనేందుకు రాచనగరికి వస్తున్న ఏనుగులకు మైసూరు జిల్లా హుణసూరు తాలూకా వీరహొసనహళ్లి వద్ద మంత్రులు ఎస్‌.టి.సోమశేఖర్‌, ఉమేశ్‌ కత్తి, ఎమ్మెల్సీలు హెచ్‌.విశ్వనాథ్‌, మంచేగౌడ, మేయరు సునంద పాలనేత్ర, జిల్లాధికాగి డా.బగాది గౌతమ్‌ సంప్రదాయక పూజలు చేశారు. ఈ ఏడాది నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలు 411వ ఏడాదిలోకి అడుగు పెట్టాయి. పూజల సమయంలో మంత్రి ఉమేశ్‌ కత్తి పాదరక్షలు ధరించారని స్థానికులు ఆరోపించారు. జంబూ సవారీలో 14 ఏనుగులు పాల్గొంటాయి. మొదటి విడతలో అభిమన్యు, అర్జున, ధనుంజయ, మహేంద్ర, భీమ, చైత్య, గోపాలస్వామి, కావేరి, లక్ష్మి బెంగళూరుకు చేరుకుంటాయి. వీటికి పూజల అనంతరం చిరుజల్లుల మధ్యే తమ ప్రయాణాన్ని రాచనగరికి కొనసాగించాయి. బుధవారం ఉదయానికి ఈ ఏనుగులు ప్యాలెస్‌ మైదానానికి చేరుకుంటాయని సోమశేఖర్‌ తెలిపారు. రెండేళ్లుగా నామమాత్రంగా నిర్వహించిన ఉత్సవాలు ఈ ఏడాది ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. దసరా ఉత్సవాల నిర్వహణ, కార్యక్రమాల వివరాలను జిల్లా వ్యవహారాల బాధ్యునిగా సోమశేఖర్‌ శనివారమే విడుదల చేశారు.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని