logo

నగర దారులపై.. విద్యుత్తు బస్సుల రయ్‌..రయ్‌

స్వాతంత్య్ర 75వ అమృత మహోత్సవం సందర్భంగా బెంగళూరు నగరవాసులకు బీఎంటీసీ 75 నాన్‌ ఏసీ విద్యుత్తు బస్సులను కొత్తగా వివిధ మార్గాల్లో నడపనుంది. ఈనెల 15న ఆ బస్సులు రహదారిపై సంచరించేందుకు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పచ్చజెండా ఊపనున్నారు.

Published : 08 Aug 2022 01:45 IST

నగర రహదారులపై సంచరించనున్న నూతన విద్యుత్తు బస్సు

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: స్వాతంత్య్ర 75వ అమృత మహోత్సవం సందర్భంగా బెంగళూరు నగరవాసులకు బీఎంటీసీ 75 నాన్‌ ఏసీ విద్యుత్తు బస్సులను కొత్తగా వివిధ మార్గాల్లో నడపనుంది. ఈనెల 15న ఆ బస్సులు రహదారిపై సంచరించేందుకు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై పచ్చజెండా ఊపనున్నారు. 12 మీటర్ల పొడవు కలిగిన నాన్‌ ఏసీ విద్యుత్తు బస్సులను అశోక్‌ లేల్యాండ్‌ అందజేస్తుంది. కొత్త బస్సులు దూరం మార్గాల్లో సంచరిస్తాయి. తొలి దశలో యలహంక డిపో నుంచి బస్సుల సంచారం ప్రారంభిస్తామని బీఎంటీసీ అధికారులు తెలిపారు. యలహంక- శివాజినగర 290ఈ, యలహంక- కెంగేరి 402 బీ,డీ, మెజిస్టిక్‌ కెంపేగౌడ బస్టాండు- యలహంక ఉపనగర మార్గాల్లో తొలి విడత బస్సులు సంచరిస్తాయని వివరించారు. యలహంక డిపోలో విద్యుత్తు బస్సుల ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మరో రెండు బిడది, అత్తిబెలె డిపోల్లో ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. బస్సు తయారీ సంస్థ ఆ బస్సులకు డ్రైవర్‌ను కూడా నియమిస్తోంది. డ్రైవర్‌ బస్సు నిర్వహణ, ఛార్జింగ్‌, తదితర వాటిని పర్యవేక్షిస్తారు. 41 ఆసనాలతో కూడిన బస్సును అరగంట పాటు ఛార్జింగ్‌ చేస్తే 150 కిలోమీటర్లు సంచరిస్తాయి. మళ్లీ ఛార్జింగ్‌ చేస్తే అదనంగా 75 కిలోమీటర్లు సంచరిస్తాయని తెలిపారు. మెజిస్టిక్‌, కెంగేరి, యశ్వంతపుర, సిల్క్‌బోర్డు బస్సు డిపోల్లో మూడువందల విద్యుత్తు బస్సులను ఛార్జింగ్‌ చేసే అవకాశం కల్పించారు. దివ్యాంగులు బస్సు ఎక్కేందుకు కుర్చీ లిఫ్టింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని