logo

అకాడమీలు, ప్రాధికారలకు నియామకాలు

వివిధ అకాడమీలు, ప్రాధికారలకు అధ్యక్షులను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొన్ని అకాడమీల్లో సభ్యులను తొలగించి, కొత్త వారికి అవకాశం ఇచ్చింది. కర్ణాటక బయలాట అకాడమీ - అజిత్‌ నాగప్ప బసాపురను అధ్యక్షునిగా, తిప్పేస్వామి,

Published : 08 Aug 2022 01:45 IST

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: వివిధ అకాడమీలు, ప్రాధికారలకు అధ్యక్షులను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొన్ని అకాడమీల్లో సభ్యులను తొలగించి, కొత్త వారికి అవకాశం ఇచ్చింది. కర్ణాటక బయలాట అకాడమీ - అజిత్‌ నాగప్ప బసాపురను అధ్యక్షునిగా, తిప్పేస్వామి, దత్తాత్రేయ అరళికట్టిలను సభ్యులుగా నియమించారు. లలిత కళా అకాడమీకి కొత్త సభ్యులుగా రామగౌతమ్‌, గురుసిద్ధప్ప మల్లాపుర, కమల్‌ అహ్మద్‌, శిల్పా కడకబావిలకు అవకాశం దక్కింది. కొంకణి సాహిత్య అకాడమీ సభ్యులుగా ఓం గణేష్‌, రమేశ్‌ పురుసయ్య మేస్తరును నియమించారు. కర్ణాటక నాటక అకాడమీకి కొత్త సభ్యులుగా శ్రీధర హెగ్డే, ప్రదీప్‌ చంద్ర కుత్పాడి, ఆరదిదేవ శిఖామణి, జీవన్‌ కుమార్‌, విజయకుమార్‌ మాలూరు, గణపతి హిత్లక్క, ఎం.ఎన్‌.కిరణ్‌ కుమార్‌, ప్రసన్న కుమార్‌లను నియమించారు. కర్ణాటక జానపద అకాడమీకి కొత్త సభ్యులుగా డా.అప్పాజీ, బసవరాజ శివప్ప, శివేశ్వర గౌడ, సణ్ణ వీరప్ప హాలప్పలకు నియామక పత్రాలు పంపించారు. కర్ణాటక సంగీత, నృత్య అకాడమీ కొత్త సభ్యులుగా గణేష ఉడుప, నాగరాజ హెగ్డే నియమితులయ్యారు. కర్ణాటక బ్యారి సాహిత్య అకాడమీకి కొత్త సభ్యులుగా అబ్దుల్‌ రెహమాన్‌, హైదరాలి, ఎం.కె.మఠ, మహ్మద్‌ ముస్తఫాలను ప్రభుత్వం నియమించింది. కర్ణాటక సాహిత్య అకాడమీకి కొత్త సభ్యునిగా కేశవ బంగేరాను నియమించారు. కర్ణాటక కొడవ సాహిత్య అకాడమీకి కొత్త సభ్యులుగా కౌశల్యా సతీశ్‌, నాగేశ కాలూరు, ప్రమీళా నాచయ్య, చామర దినేశ్‌ బెళ్యప్పలు నియమితులయ్యారు. రంగసమాజకు డా.శశిధర్‌ నరేంద్ర, శీన నడోళి, రాజణ్ణ జీవర్గి, దాక్షాయణి భట్, గురుప్రసాద్‌లను, కన్నడ అభివృద్ధి ప్రాధికారకు డ్యాని పెరేర, డా.రాజీవ్‌ లోచన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని