logo
Published : 08 Aug 2022 01:45 IST

ముఖ్యమంత్రి నిర్ణయమే శిరోధార్యం

శివమొగ్గ, న్యూస్‌టుడే: తనకు మంత్రిగా మరోసారి అవకాశం ఇవ్వాలా.. వద్దా అని ముఖ్యమంత్రి బొమ్మై తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని మాజీ మంత్రి కె.ఎస్‌.ఈశ్వరప్ప పేర్కొన్నారు. శివమొగ్గలోని నివాసంలో తనను కలుసుకున్న విలేకరులతో ఆదివారం మాట్లాడారు. తనపై ఆరోపణలు వచ్చిన వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేశామని గుర్తు చేశారు. తనకు గుత్తేదారు సంతోష్‌ పాటిల్‌కు సంబంధం లేదని పోలీసులు దర్యాప్తు నివేదిక ఇచ్చిన తర్వాత తనకు మంత్రి పదవి ఇస్తారని భావించానని తెలిపారు. మంత్రి పదవి కోసం తాను ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కలహాలు ఎక్కువ అయ్యాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధరామయ్య ఇప్పటి వరకు నియోజకవర్గమే దొరకడం లేదని పేర్కొన్నారు. సిద్ధరామయ్య, శివకుమార్‌ ఇద్దరూ కులాలపై ఆధారపడి రాజకీయాలు చేయడంలో నిష్ణాతులని ఆరోపించారు. వీరిద్దరిలో జాతీయ భావమే లేదని విమర్శలు గుప్పించారు.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని