logo

లౌకికతత్వాన్ని పరిరక్షించుకోవాలి

రాజ్యాంగం కల్పించిన లౌకికతత్వాన్ని పరిరక్షించుకోవాలని కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఎన్‌ నాగమోహన్‌దాస్‌ పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌

Published : 08 Aug 2022 01:45 IST

మాట్లాడుతున్న జస్టిస్‌ హెచ్‌ఎన్‌ నాగమోహన్‌దాస్‌. చిత్రంలో వినయ్‌కుమార్‌, విద్యాసాగర్‌

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: రాజ్యాంగం కల్పించిన లౌకికతత్వాన్ని పరిరక్షించుకోవాలని కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఎన్‌ నాగమోహన్‌దాస్‌ పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ‘జాతీయత - రాజ్యాంగ నిర్వచనం’ అంశంపై నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. రాజ్యాంగ నైతిక విలువలు అమలయ్యేలా ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. దేశంలో కులం, మతం పేరుతో దాడులు సరికాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. భావప్రకటన స్వేచ్ఛ ఎంతో ముఖ్యమన్నారు. ఐలు రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌ మాట్లాడుతూ కేంద్రంలోని భాజపా సర్కారు కులం, మతం పేరిట ఓట్ల రాజకీయాలు చేయడం సరికాదన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్ట్‌ కార్యదర్శి వినయ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ పాలనలో ఫాసిజం పెరిగిందన్నారు. ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసారథి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని