logo

చేనేత ఉత్పత్తులను ప్రోత్సహిస్తాం

చేనేత ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని చేతి మగ్గాలు, జౌళి, చక్కెర అభివృద్ధి శాఖ మంత్రి శంకర పాటిల మునేనకుప్ప పిలుపునిచ్చారు. చేనేతను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను జారీ చేస్తున్నాయని గుర్తు చేశారు.

Published : 08 Aug 2022 01:45 IST

చరఖా వద్ద దివ్యజ్ఞాన నందగిరి స్వామి, ప్రభులింగ స్వామి, చేనేత సమాఖ్య అధ్యక్షుడు సోమశేఖర్‌, తదితరులు

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే: చేనేత ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని చేతి మగ్గాలు, జౌళి, చక్కెర అభివృద్ధి శాఖ మంత్రి శంకర పాటిల మునేనకుప్ప పిలుపునిచ్చారు. చేనేతను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను జారీ చేస్తున్నాయని గుర్తు చేశారు. ఎనిమిదో జాతీయ చేతిమగ్గాల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్రకళా పరిషత్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ చేనేతలకు పురస్కారాలు ప్రదానం చేసి మాట్లాడారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే దిశలో 2017 ఆగస్టు 7ను జాతీయ చేతిమగ్గాల దినోత్సవంగా కేంద్రం ప్రకటించిందన్నారు. పట్టు చీరపై తమ పంటతో రైతుల చిత్రాన్ని నేసిన మొళకాల్మూరుకు చెందిన చేనేత డి.ఎస్‌.మల్లికార్జునకు మొదటి బహుమతి, పట్టు వస్త్రంపై పునీత్‌ రాజ్‌కుమార్‌ చిత్రాన్ని నేసిన కొళ్లేగాలకు చెందిన పి.శ్రీనివాస్‌, ఇతర వస్త్ర విభాగాల్లో కాటన్‌ చీరపై భారతదేశ పటాన్ని నేసిన చిక్కోడికి చెందిన సచీన బాహుసాబ తెరదాళ, కొండి సాంకేతికతతో ఇళకల్‌ మాదిరి చీర నేసిన బీళగికి చెందిన పడియప్ప గోకావి, ఉన్నితో బావుటా చేసిన చిక్కోడికి చెందిన శంకర సణ్ణక్కికి ఆయన పురస్కారాలు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో చేతి మగ్గాల అభివృద్ధి మండలి అధ్యక్షుడు సిద్ధు సవది, కర్ణాటక జౌళి మౌలిక సదుపాయాల అభివృద్ధి మండలి అధ్యక్షుడు గుత్తిగనూరు విరూపాక్ష, వివిధ మఠాల ప్రతినిధులు, చేనేత సమాఖ్య అధ్యక్షుడు సోమశేఖర్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని