logo

బళ్లారి కొండపై చిరుత ప్రత్యక్షం

బళ్లారి ఏకశిల కొండపై మూడు రోజుల తర్వాత చిరుత మరోసారి ప్రత్యక్షమైన వీడియోలు చిత్రాలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.

Updated : 09 Aug 2022 02:49 IST


బళ్లారి కొండపై ఉన్న చిరుత

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి ఏకశిల కొండపై మూడు రోజుల తర్వాత చిరుత మరోసారి ప్రత్యక్షమైన వీడియోలు చిత్రాలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఐదు రోజుల ముందు బళ్లారి కొండపై చిరుత కనిపించినట్లు స్థానిక సంజయ్‌గాంధీనగర ప్రజలు అటవీశాఖాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై అటవీశాఖ ఉప సంరక్షణాధికారి సందీప్‌ సూర్యవంశీ, ఆర్‌.ఎఫ్‌.వో మంజునాథ నేతృత్వంలో మూడు రోజులు కొండపై డ్రోన్‌ కెమెరాలతో అన్వేషణ ప్రారంభించారు. సోమవారం గాలి, తుంపర వర్షం పడటంతో డ్రోన్‌ సహకరించలేదు. సోమవారం సాయంత్రం సంజయ్‌గాంధీనగర్‌ సమీప కొండలోని బండరాయిపై చిరుత ప్రత్యక్షమైంది. స్థానిక ప్రజలు గుర్తించి తక్షణమే చరవాణిల్లో ఫొటోలు, వీడియోలు తీసి అధికారులకు పంపారు. సంజయ్‌గాంధీనగర్‌ సంఘం కార్యదర్శి, విశ్రాంత రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ విజయకుమార్‌ న్యూస్‌టుడేతో మాట్లాడుతూ మూడు రోజులుగా అటవీశాఖాధికారులు, సిబ్బంది గాలింపు చేస్తున్న చిరుత ఆచూకీ గుర్తించలేక పోయారని, కనీసం నిపుణులను తీసుకొని వచ్చి చిరుతను బంధించాలని కోరారు. దీనిపై అటవీశాఖ ఆర్‌.ఎఫ్‌.వో మంజునాథ మాట్లాడుతూ సంజయ్‌గాంధీనగర్‌ సమీపంలోని ఉద్యానవనం, లెప్రసి కాలనీలో బోన్లు ఉంచాం. అటవీశాఖ సిబ్బంది, పోలీసులను రాత్రి పూట గస్తీకి నియమించినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు