logo

అధ్వాన వీధులపై ఆగ్రహం

జోరు వానలకు బెంగళూరు శివారు వీధులు అధ్వానంగా మారుతున్నాయి. వాటిని బాగు చేయాలంటూ హైకోర్టు పలు దఫాలుగా హెచ్చరిస్తున్నా బెంగళూరు పాలికె అధికారులకు వీలుకాలేదు.

Published : 09 Aug 2022 02:25 IST


పాడైన రహదారికి ఇరువైపులా నిలుచుని నిరసన హోరు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : జోరు వానలకు బెంగళూరు శివారు వీధులు అధ్వానంగా మారుతున్నాయి. వాటిని బాగు చేయాలంటూ హైకోర్టు పలు దఫాలుగా హెచ్చరిస్తున్నా బెంగళూరు పాలికె అధికారులకు వీలుకాలేదు. పాడవుతున్న రహదారుల విషయంలో నగరవాసులు అసహనం ప్రదర్శిస్తున్నారు. సోమవారం ఉదయం సర్జాపుర చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు రహదారులపైకి వచ్చిన నిరసన ప్రదర్శన మొదలుపెట్టారు. అన్ని రకాల పన్నులూ చెల్లిస్తున్నా అభివృద్ధి పడకేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస మౌలిక సౌకర్యాలు కల్పించకపోతే అధికారంలో ఎందుకు కొనసాగడమని నేతలు ఆక్రోశం వ్యక్తం చేశారు. రహదారికి ఇరువైపుల ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. కొద్ది సేపు వాహన సంచారాన్ని నిలిపివేశారు. ఆందోళనలో ముంపునకు గురైన రెయిన్‌బో డ్రైవ్‌ లేఔట్‌ నివాసులూ ఆందోళనలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు