logo
Published : 10 Aug 2022 02:40 IST

సమరయోధులకు సత్కార దండ

స్వాతంత్య్ర సమరయోధుడు శంకర నారాయణరావును సత్కరిస్తున్న గవర్నర్‌ గహ్లోత్‌, మంత్రి అశోక్‌

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : క్విట్ ఇండియా ఉద్యమం, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ముగ్గురు యోధులను గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ మంగళవారం సత్కరించారు. స్వాతంత్ర అమృతమహోత్సవంలో భాగంగా మంత్రులు అశ్వత్థ నారాయణ, అశోక్‌లతో కలిసి వారిని సత్కరించి, మిఠాయిలు తినిపించారు. జేపీనగర నాలుగో స్టేజ్‌ ఆశ్రయ అపార్ట్‌మెంట్లో ఉంటున్న ఆర్‌.నారాయణప్ప, బనశంకరి మూడో స్టేజ్‌లో ఉంటున్న శంకరనారాయణ రావ్‌, మల్లేశ్వరంలోని నాగభూషణరావు నివాసాలకు గహ్లోత్‌ వెళ్లారు. వారికి ప్రమాణపత్రాలు అందజేసి, ఆరోగ్యం, స్వాతంత్య్ర పోరాటంలో వారి అనుభవాలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ‘మీ దేశ సేవ మా అందరికీ స్ఫూర్తి. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను గౌరవించడం మా అందరి ప్రధమ కర్తవ్యం’ అని గహ్లోత్‌ సమరయోధులకు తెలిపారు. క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంజీ రోడ్డు ఉద్యానంలో నిర్వహించిన కార్యక్రమంలో బాపూ విగ్రహంపై విద్యార్థినులు గులాబీ రేకులు చల్లి నివాళి అర్పించారు.


ఎంజీరోడ్డు : మహాత్ముని విగ్రహంపై విద్యార్థుల గులాబీల వర్షం

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని