logo
Published : 10 Aug 2022 02:40 IST

‘లోకాయుక్త’పేరిట గోల్‌మాల్‌పై విచారణ

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : బెంగళూరు నగర జిల్లా పంచాయతీ కార్యనిర్వాహఖ ఇంజినీరు ఎం.ఎన్‌.కృష్ణమూర్తిని బెదిరించి రూ.కోటి లంచాన్ని డిమాండ్‌ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ లోకాయుక్త జస్టిస్‌ వై.భాస్కరరావు, ఆయన కుమారుడు అశ్విన్‌రావులపై ప్రత్యేక న్యాయస్థానం విచారణ కొనసాగించింది. అప్పటి లోకాయుక్త ఎస్పీ సోనియా నారంగ్‌, ఫిర్యాదుదారుడు కృష్ణమూర్తి, మరికొందరు అధికారుల వాంగ్మూలాన్ని లోకాయుక్త న్యాయస్థానం నమోదు చేసుకుంది. రూ.కోటి ఇవ్వకపోతే నా నివాసంపై దాడి చేసి, ఆస్తులను జప్తు చేస్తామని తనను పలువురు అధికారులు, అశ్విన్‌రావు బెదిరించారని న్యాయస్థానానికి కృష్ణమూర్తి వివరించారు. లోకాయుక్త కార్యాలయం సిబ్బంది సయ్యద్‌ రియాజ్‌, దళారులుగా వ్యవహరించిన అశోక్‌కుమార్‌, నరసింహారావు, వి.భాస్కర్‌, శంకర్‌ గౌడ తనను 2015 జూన్‌లో పలుసార్లు బెదిరించారని వివరించారు. లోకాయుక్త చరిత్రలో ఈ ఘటనను నల్లమచ్చగా పరిగణించిన ప్రభుత్వం సీనియరు పోలీసు అధికారి కమల్‌ పంత్‌ (బెంగళూరు కొత్వాలుగా సేవలు అందించారు) నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు దళాన్ని ఏర్పాటు చేసింది. దర్యాప్తు పూర్తి చేసిన సిట్ ఇప్పటికే 1200కు పైచిలుకు పుటలతో అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. దర్యాప్తునకు నేతృత్వం వహించిన అధికారులు, సిబ్బంది, సాక్షుల విచారణ, వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేసుకునే ప్రక్రియ ప్రారంభించింది. త్వరలో కమల్‌పంత్‌, ఆ సమయంలో విధుల్లో ఉన్న అధికారులు, సిట్ ప్రతినిధుల వాంగ్మూలాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉంది.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని