logo

ఇంధన చోరుల పట్టివేత

పట్టణంలో ఇంధనం (డీజిల్‌) దొంగిలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ వెంకటేశ్‌ నాయక్‌ సోమవారం రాత్రి విలేకర్లకు వెల్లడించిన వివరాల మేరకు.. జులై 31న పట్టణంలోని కోనాపూరు పేట బంగారుగడ్డ ప్రాంతం

Published : 10 Aug 2022 02:40 IST

నిందితులను చూపుతున్న పోలీసులు

మాన్వి,న్యూస్‌టుడే: పట్టణంలో ఇంధనం (డీజిల్‌) దొంగిలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ వెంకటేశ్‌ నాయక్‌ సోమవారం రాత్రి విలేకర్లకు వెల్లడించిన వివరాల మేరకు.. జులై 31న పట్టణంలోని కోనాపూరు పేట బంగారుగడ్డ ప్రాంతం ఉన్న రిలయన్స్‌ సంస్థ టవర్‌, సీˆకల్‌ క్రాస్‌ వద్ద ఉన్న మరో మొబైల్‌ టవర్ల జనరేటర్లకు వినియోగించేందుకు అందుబాటులో ఉంచిన 115 లీటర్ల డీజిల్‌ చోరీ జరిగింది. ఈవిషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు  పీˆఐ మహాదేవప్ప పంచముఖి, ఎస్సై వెంకటేశ్‌, పోలీస్‌ సిబ్బంది దేవరాజ్‌, హుసేన్‌సాబ్‌, బసవరాజ్‌, లక్ష్మణ, ప్రకాష్‌లతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై దర్యాప్తు నిర్వహించిన పోలీసులు నిందితులను గుర్తించారు. మహ్మద్‌ హుసేన్‌ సుంకేశ్వర తండా, వెంకటేశ్‌ సుంకేశ్వర తండా, రాజామహ్మద్‌ పింజార్‌ శాస్త్రీ క్యాంపులను అదుపులోకి తీసుకుని విచారించారు. వీరి నుంచి డీజిల్‌ విక్రయించిన డబ్బు, చోరీకి వినియోగించిన ఆయిల్‌ క్యాన్లు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని