logo

దేశభక్తి.. అపూర్వ ‘చిత్ర’గీతి

బెంగళూరులోని ప్రభుత్వ చిత్రకళాపరిషత్‌లో ‘భారతమాత’ అనే అంశమై సుందరమైన వర్ణ చిత్ర ప్రదర్శన సోమవారం సాయంత్రం ప్రారంభమైంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి డాక్టర్‌ మమత, చిత్రకళాపరిషత్‌ అధ్యక్షుడు బి.ఎల్‌.శంకర్‌ ఈ వేదికను ఆవిష్కరించి..

Published : 10 Aug 2022 02:40 IST

మెచ్చిన రూపాలకు చక్కని గుర్తింపు

ప్రదర్శన ప్రారంభిస్తున్న ఐఏఎస్‌ అధికారిణి డాక్టర్‌ మమత

బెంగళూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే : బెంగళూరులోని ప్రభుత్వ చిత్రకళాపరిషత్‌లో ‘భారతమాత’ అనే అంశమై సుందరమైన వర్ణ చిత్ర ప్రదర్శన సోమవారం సాయంత్రం ప్రారంభమైంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి డాక్టర్‌ మమత, చిత్రకళాపరిషత్‌ అధ్యక్షుడు బి.ఎల్‌.శంకర్‌ ఈ వేదికను ఆవిష్కరించి.. వీక్షణకు అవకాశం కల్పించారు. నగరంలోని ఈ-స్టుడియో ఆర్ట్‌హోం సంస్థ వ్యవస్థాపకురాలు సోనుముల్‌చందాని 75వ స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో ఈ చిత్ర ప్రదర్శనకు ముందుకువచ్చారు. కోల్‌కతా, ముంబయి, దిల్లీ, పుణె, తిరుచ్చి, బెంగుళూరు తదితర ప్రాంతాల నుంచి 18 మంది కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొని భారతమాత వివిధ రూపాలను తీర్చిదిద్దారు. చిత్తరువులన్నీ చూపరులను మంత్రముగ్ధుల్నిచేస్తున్నాయి. ఇలాంటి ప్రదర్శన 1905లో రవీంద్రనాథ ఠాగూర్‌ సోదరుడు (కజిన్‌) అబనీంద్రనాథ్‌ నాటి భారతమాత వివిధ రూపాలను చిత్రీకరించి ప్రదర్శించడాన్ని నిర్వాహకులు గుర్తుచేశారు. ఇలాంటి ప్రదర్శనలు ఇతర నగరాల్లోనూ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో డీఆర్‌డీఓ అధికారిణి డాక్టర్‌ నీతా, ఓగ్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ సంస్థ ఛైర్మెన్‌ డాక్టర్‌ అశోక కారియప్ప, హెచ్‌డీఎఫ్‌సీ సంస్థ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌ తదితరులు పాల్గొని కళాకారులను అభినందించారు. ఈనెల 14 వరకు ప్రదర్శన కొనసాగుతుంది.

శాంతిప్రదాత.. మన దేశమాత

భారతావని.. శక్తిస్వరూపిణి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని