logo

యువత జీవనోపాధికి శిక్షణ

గ్రామీణ నిరుద్యోగ యువత జీవనోపాధికి కావలసిన శిక్షణ అందించేందుకు నాస్కాం ముందుకు వచ్చింది. మైక్రో ఫోకస్‌ సంస్థ సహకారంతో బెంగళూరుకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఇప్పటి వరకు 730 మందికి శిక్షణ ఇచ్చామని నాస్కాం ఫౌండేషన్‌

Published : 10 Aug 2022 02:40 IST

నిర్వాహకుల నుంచి ట్యాబ్ అందుకుంటున్న విద్యార్థులు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : గ్రామీణ నిరుద్యోగ యువత జీవనోపాధికి కావలసిన శిక్షణ అందించేందుకు నాస్కాం ముందుకు వచ్చింది. మైక్రో ఫోకస్‌ సంస్థ సహకారంతో బెంగళూరుకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఇప్పటి వరకు 730 మందికి శిక్షణ ఇచ్చామని నాస్కాం ఫౌండేషన్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నిధి భాసిన్‌ తెలిపారు. ఉద్యాననగరిలోని స్మైల్‌ ఫౌండేషన్‌ ప్రాంగణంలో వారానికి ఒక రోజు డిజిటల్‌ వేదికల ద్వారా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి అవకాశాలను చూపించి ప్రోత్సహిస్తున్నామని వివరించారు. డిజిటల్‌ అక్షరాస్యత, అంతర్జాలంలో మోసాలపై అవగాహన, సైబర్‌ చట్టాలు, సామాజిక దౌర్జన్యాలపై జాగృతి కల్పించడం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాల్లో వీరికి శిక్షణ ఇచ్చి, ఆ విభాగాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకునేందుకు సహకారాన్ని అందిస్తున్నామని చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సంస్థ, ఫౌండేషన్‌ ప్రతినిధులు సంయుక్తంగా మంగళవారం ట్యాబ్‌లు, ప్రమాణపత్రాలు అందించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు