logo

కామన్వెల్త్‌ విజేతలకు పండుగే

బ్రిటన్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న కామన్వెల్త్‌ క్రీడా పోటీల్లో భారత క్రీడాకారులు అద్భుత సాధనలు చేశారని క్రీడా శాఖ మంత్రి డాక్టర్‌ సి.నారాయణగౌడ సంతోషం వ్యక్తం చేశారు. భారత అథ్లెట్లు వేర్వేరు

Published : 10 Aug 2022 02:40 IST

రాజేశ్వరి గాయక్వాడ్‌                      గురురాజ పూజారి

బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడేే : బ్రిటన్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న కామన్వెల్త్‌ క్రీడా పోటీల్లో భారత క్రీడాకారులు అద్భుత సాధనలు చేశారని క్రీడా శాఖ మంత్రి డాక్టర్‌ సి.నారాయణగౌడ సంతోషం వ్యక్తం చేశారు. భారత అథ్లెట్లు వేర్వేరు విభాగాల్లో 22 బంగారు, 16 రజత, 23 కాంస్య పతకాలను సాధించి ఈ అంతర్జాతీయ పోటీల్లో నాలుగో స్థానం చేరుకోవడాన్ని మెచ్చుకున్నారు. భారత జట్టులో పాల్గొన్న కన్నడిగుల పతక సాధనలకు ప్రతిగా నగదు పురస్కారాలు అందిస్తామని మంత్రి ప్రకటించారు. రజత పతకాన్ని సాధించిన రాజేశ్వరి గాయక్వాడ్‌కు రూ.15 లక్షలు, వెయిట్‌లిఫ్టింగ్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకొన్న గురురాజ పూజారికి రూ.8 లక్షలు, బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో వెండి పతకాన్ని సాధించిన అశ్వినీ పొన్నప్పకు రూ.15 లక్షలు త్వరలోనే అందిస్తామని మంత్రి తెలిపారు. క్రీడలకు ప్రోత్సాహం అందిచేందుకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అమృత క్రీడా దత్తత పథకంలో కర్ణాటక క్రీడాకారులకు ఊతమిస్తామన్నారు.

అశ్వినీపొన్నప్ప

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని