logo

అక్రమార్జనకు ఉద్యోగాల ఎర

కొంత మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల పేర్లు చెప్పి కర్ణాటక అడ్మిషన్‌ సర్వీస్‌ (కేఏఎస్‌) పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేలా చేస్తామని నమ్మించి పలువురిని మోసగిస్తున్నాడనే ఆరోపణపై సిద్ధరాజు కట్టిమని అనే వ్యక్తిని విజయనగర పోలీసులు అరెస్టు చేశారు. కేఏఎస్‌ పరీక్షలో పాస్‌ చేయిస్తానని చెప్పి సవితా శాంతప్ప

Published : 11 Aug 2022 05:58 IST

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : కొంత మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల పేర్లు చెప్పి కర్ణాటక అడ్మిషన్‌ సర్వీస్‌ (కేఏఎస్‌) పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేలా చేస్తామని నమ్మించి పలువురిని మోసగిస్తున్నాడనే ఆరోపణపై సిద్ధరాజు కట్టిమని అనే వ్యక్తిని విజయనగర పోలీసులు అరెస్టు చేశారు. కేఏఎస్‌ పరీక్షలో పాస్‌ చేయిస్తానని చెప్పి సవితా శాంతప్ప అనే మహిళ నుంచి రూ.59 లక్షలు తీసుకుని మోసగించాడనేది ప్రధాన అభియోగం. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. కలబురగి జిల్లా అఫలపుర నివాసి సవితా శాంతప్ప కొంత కాలంగా ఈ పరీక్షకు సిద్ధమవుతోంది. నిందితుడు సిద్ధరాజు కట్టిమని ఆమెకు పరిచయమయ్యాడు. ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారుల్లో చాలామంది తనకు తెలుసునంటూ నమ్మించాడు. ఉన్నతాధికారులు శాలిని రజనీశ్‌, ప్రవీణ్‌సూద్‌ తనకు బాగా తెలుసంటూ డాంబికాలు పలికాడు. అతడి మాటలు నమ్మి దశలవారిగా రూ.59 లక్షలు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బు కోసం ఉన్న 3.5 ఎకరాలను ఆమె తండ్రి శాంతప్ప విక్రయించాడు. చివరికి ఆ పరీక్షలో ఫలితమేదీ రాకపోవడంతో నగదు వెనక్కి ఇవ్వాలని డిమాండు చేస్తే.. సిద్ధరాజు బెదిరిస్తున్నాడని ఆమె వాపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని