logo

ప్రచారం కోసమే ‘సిరా’ పోశారట

రైతు నాయకుడు రాకేశ్‌ టికాయత్‌పై దాడి చేసి మసి పూసిన సంఘటనపై దర్యాప్తు చేసిన హైగ్రౌండ్స్‌ పోలీసులు 450 పుటల ఛార్జిషీట్‌ను న్యాయస్థానానికి సమర్పించారు.

Published : 11 Aug 2022 05:58 IST

సిరామరకలతో టికాయత్‌ (పాతచిత్రం)

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : రైతు నాయకుడు రాకేశ్‌ టికాయత్‌పై దాడి చేసి మసి పూసిన సంఘటనపై దర్యాప్తు చేసిన హైగ్రౌండ్స్‌ పోలీసులు 450 పుటల ఛార్జిషీట్‌ను న్యాయస్థానానికి సమర్పించారు. మొత్తం 20 మంది సాక్షులు అందించిన వివరాలను నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి అరెస్టైన ఇద్దరు వ్యక్తులు జామీనుపై విడుదలయ్యారు. దాడి నేపథ్యంలో ఆ ఇద్దరి ఫోన్‌ సంభాషణ, సాంకేతిక విషయాలు, సీసీ కెమెరా దృశ్యాలను నమోదు చేశారు. కేంద్ర నాయకులు తమను గుర్తించాలనే తపన, పేరు ప్రఖ్యాతలు సాధించాలనే ఆలోచనతో మే 29న నగరానికి వచ్చిన రాకేశ్‌ టికాయత్‌పై కోడిగుడ్లు, టామెటాలతో దాడి చేయాలని నిందితులు ప్రయత్నించారని, భద్రత ఎక్కువగా ఉండటంతో అది సాధ్యం కాలేదని అధికారులు వివరించారు. ఆ మరుసటి రోజు గాంధీభవన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి టికాయత్‌ హాజరయ్యారు. అదే అదనుగా సీసాలో మసి, సిరా నింపుకొని వేదికపైకి ఎక్కి ఆయనపై దాడి చేసినట్లు నిందితుడు శివకుమార్‌ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. శివకుమార్‌తో పాటు భరత్‌శెట్టి, దిలీప్‌నూ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు