logo

అత్యుత్తమ ఆర్థికవేత్త డా.శేషాద్రి

భారతదేశంలో తలసరి ఆదాయం పెరుగుతోందని చెబుతున్నా....ప్రభుత్వం భారీగా పన్నులు పెంచుతోంది. సామాన్యులు మాత్రం అభివృద్ధి చెందడం లేదు. సామాన్య ప్రజలు ఆర్థిక, సామాజిక, మౌలిక, విద్యా సామర్థ్యాలు అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములయ్యేలా

Published : 11 Aug 2022 05:58 IST

కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, అధ్యాపకులు

బళ్లారి, న్యూస్‌టుడే: భారతదేశంలో తలసరి ఆదాయం పెరుగుతోందని చెబుతున్నా....ప్రభుత్వం భారీగా పన్నులు పెంచుతోంది. సామాన్యులు మాత్రం అభివృద్ధి చెందడం లేదు. సామాన్య ప్రజలు ఆర్థిక, సామాజిక, మౌలిక, విద్యా సామర్థ్యాలు అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములయ్యేలా అభివృద్ధి చెందాలని హంపీ కన్నడ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు డా.ఎం.చంద్రపూజరి పేర్కొన్నారు. డా.శేషాద్రి స్మారక ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ సరళాదేవి సతీశ్చంద్ర అగరవాల్‌ డిగ్రీ కళాశాలలో డా.శేషాద్రి స్మరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కోట్లాది మూలధనాన్ని ఖర్చు చేసినా...ప్రజలు ప్రయోజనం పొందలేక పోతున్నారు. అభివృద్ధి ప్రక్రియలో సామాన్య ప్రజలను భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. అప్పుడే అభివృద్ధి చెందుతుందన్నారు. బహుళజాతి కంపెనీలను ఆహ్వానించే సామర్థ్యం దేశానికి ఉండాలి. దేశంలో మౌలిక వసతులు, నైపుణ్యం లేని మానవ వనరులు, శాంతిభద్రతలు చూసి కంపెనీలు ముందుకు రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. కళాశాల ప్రధాన ఆచార్యులు డా.ఆర్‌.ఎం.శ్రీదేవి మాట్లాడుతూ మా గురువు డా.శేషాద్రి. ఆయన మార్గదర్శనంలో ముందుకు వెళ్లడంతో మంచి భవిష్యత్తులో స్థిరపడనట్లు వివరించారు. కార్యక్రమంలో మోకా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డా.హోన్నూరువలి, డా.అబ్దుల్‌ అజీజ్‌ మాట్లాడారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డా.శేషాద్రి స్మారక ట్రస్ట్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కె.సి.కొండయ్య మాట్లాడుతూ డా.శేషాద్రి రాష్ట్రంలోనే అత్యుత్తమ ఆర్థికవేత్త, బళ్లారి అభివృద్ధిలో ఉన్నత ఆలోచనలు ప్రజాప్రతినిధులతో పంచుకొనేవారన్నారు. డా.శేషాద్రి చిత్రపటం పెన్సిల్‌తో అక్కడే గీసిన ప్రముఖ చిత్ర కళాకారుడు మంజునాథ గోవిందవాడకు సన్మానం చేశారు. అనంతరం పుస్తకం విడుదల చేశారు. కార్యక్రమంలో విశ్రాంత తెలుగు అధ్యాపకులు డా.సురేంద్రబాబు, విశ్రాంత పాత్రికేయుడు అహిరాజ్‌, డా.దురుగప్ప, సిరిగేరి పన్నారాజ్‌, డా.ఎస్‌.జయణ్ణ, తాడిపత్రి గోవింద విఠల్‌ పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని