logo

హులిహైదరలో ఇరువర్గాల ఘర్షణ

కొప్పళ జిల్లా కనకగిరి తాలూకా హులిహైదరలో గురువారం ఇరువర్గాల మధ్య జరిగిన మూకుమ్మడి ఘర్షణలో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మతాంతర వివాహం ఈ ఘర్షణలకు దారితీసినట్లు తెలిసింది.

Updated : 12 Aug 2022 03:02 IST

ఇద్దరు మృతి..పరిస్థితి ఉద్రిక్తం

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు

గంగావతి: కొప్పళ జిల్లా కనకగిరి తాలూకా హులిహైదరలో గురువారం ఇరువర్గాల మధ్య జరిగిన మూకుమ్మడి ఘర్షణలో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మతాంతర వివాహం ఈ ఘర్షణలకు దారితీసినట్లు తెలిసింది. పాషావలి అనే యువకుడు కొన్ని రోజుల కిందట ఓ యువతిని మతాంతర వివాహం చేసుకున్నాడు. గురువారం ఉదయం అతడు పువ్వులు తెచ్చేందుకు యువతి గతంలో నివసించే వీధికి వెళ్లాడు. ఆ సమయంలో యంకప్ప తళవార్‌ యువకుడిపై చేయిచేసుకున్నాడు. విషయం తెలిసి యువకుడి వర్గానికి చెందిన వారు దాడి చేశారు. యంకప్ప తళవార్‌(44) ఈ దాడిలో మృతి చెందారు. మరో యువకుడు ధర్మణ్ణ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం యువతి వర్గానికి చెందిన వారు దాడులు చేశారు. ఈ సంఘటనలో పాషావలి (22) మృతి చెందారు. ఈ రెండు హత్యలతో హులిహైదరలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్పీ అరుణాంగ్షు గిరి, గంగావతి డీవైఎస్పీ రుద్రేశ్‌ ఉజ్జిన కొప్ప సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. గ్రామంలో పోలీసులను మోహరింపజేసి నిషేధాజ్ఞలు జారీ చేశారు. కనకగిరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని