logo

ఈద్గా మైదానంలోనూ పతాకావిష్కరణ!

చారిత్రక బెంగళూరు నగర చామరాజపేటలోని వివాదాలకు నెలవుగా మారిన ఈద్గా మైదానంలో మొదటిసారిగా జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు కర్ణాటక రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది. నగర నడిబొడ్డున సుమారు రెండెకరాల్లో విస్తరించిన ఈ మైదానం ఇప్పటి వరకు వక్ఫ్‌ బోర్డు ఆధీనంలో ఉంది. ఈ స్థలం తమదేనని

Published : 13 Aug 2022 01:22 IST

చామరాజపేట ఈద్గా మైదానంలో శుక్రవారం విద్యార్థుల ప్రదర్శన

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : చారిత్రక బెంగళూరు నగర చామరాజపేటలోని వివాదాలకు నెలవుగా మారిన ఈద్గా మైదానంలో మొదటిసారిగా జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు కర్ణాటక రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది. నగర నడిబొడ్డున సుమారు రెండెకరాల్లో విస్తరించిన ఈ మైదానం ఇప్పటి వరకు వక్ఫ్‌ బోర్డు ఆధీనంలో ఉంది. ఈ స్థలం తమదేనని దాఖలాలు, ఆధారాలు చూపడంలో బోర్డు విఫలం కావడంతో దాన్ని రెవెన్యూ శాఖ స్వాధీనపరుచుకుంది. తమ శాఖ తరఫున పంద్రాగస్టుకు తమ అధికారి అక్కడ జెండా ఎగురవేస్తారని రెవెన్యూ శాఖ మంత్రి ఆర్‌.అశోక్‌ తెలిపారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు ఎటువంటి అడ్డంకులూ ఉండవని న్యాయకోవిదుల సూచనలు, పోలీస్‌ నిఘా విభాగం అధికారి దయానందతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పారు. నియమావళికి అనుగుణంగా బెంగళూరు ఉత్తర విభాగం తహసీల్దారు జెండా ఎగురవేసే అవకాశం ఉందన్నారు. నిబంధనలకు అనుగుణంగా ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలతో కలిసి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. డీసీపీ నేతృత్వంలోని పోలీసులు భద్రత ఏర్పాట్లు చూస్తారని చెప్పారు. పలు హిందూ సంఘాల ప్రతినిధులు ఇక్కడి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. వక్ఫ్‌బోర్డు వద్ద ఉన్న పత్రాల ఆధారంగా ఈ మైదానం 1965 నుంచి తన సొత్తని పేర్కొనగా, నగర సమీక్ష పత్రాల్లో ఇది ఆటల మైదానమని రెవెన్యూ శాఖ అధికారులు తేల్చారు. దీనిపై యాజమాన్య హక్కులపై అనుమానం ఉంటే ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని అశోక్‌ సూచించారు.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts