logo

సస్యవేదికపై దివ్య పతాక

అమృత మహోత్సవాల్లో భాగంగా కలబుగరి జిల్లా కమలాపుర గ్రామంలో బమ్మణ కుటుంబ సభ్యులు భారీ జాతీయ పతాకాన్ని తమ పొలంలో ప్రదర్శించారు. సుమారు 23 ఎకరాల పొలం మధ్యలో ఇనుప దూలాలతో పందిరి వేసి ఖద్దరుతో సిద్ధం చేసిన 75 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు, 140 కిలోల జాతీయ

Published : 13 Aug 2022 01:22 IST

పొలంలో ఏర్పాటు చేసిన భారీ పతాకం

కలబురగి, న్యూస్‌టుడే : అమృత మహోత్సవాల్లో భాగంగా కలబుగరి జిల్లా కమలాపుర గ్రామంలో బమ్మణ కుటుంబ సభ్యులు భారీ జాతీయ పతాకాన్ని తమ పొలంలో ప్రదర్శించారు. సుమారు 23 ఎకరాల పొలం మధ్యలో ఇనుప దూలాలతో పందిరి వేసి ఖద్దరుతో సిద్ధం చేసిన 75 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు, 140 కిలోల జాతీయ పతాకాన్ని ప్రదర్శనకు ఉంచారు. ధార్వాడ జిల్లా గరగ గ్రామంలో జాతీయ పతాకాలను తయారు చేసే 300 మంది మహిళలు ఇక్కడకు వచ్చి, స్వచ్ఛమైన పత్తిని ఉపయోగించి, తీసిన నూలుతో ఒకటిన్నర నెల సమయం తీసుకుని జాతీయ పతాకాన్ని నేశారు. జెండా నేతకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించామని బమ్మణ కుటుంబ సభ్యులు తెలిపారు. వచ్చే బుధవారం వరకు ఈ పతాకాన్ని ప్రదర్శనకు ఉంచుతామని చెప్పారు. వినూత్నంగా దేశ ప్రేమను ప్రదర్శించిన ఈ కుటుంబ సభ్యులు, భారీ పతాకాన్ని తయారు చేసిన మహిళా కార్మికులను జిల్లా పాలన యంత్రాంగం, స్థానికులు ప్రశంసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని