logo

రాఘవరాయల వైభవ దర్శనం

 పూర్వారాధన శుక్రవారం నయనానందకరంగా సాగింది. స్వామి వారు ప్రహ్లాదరాయల రూపంలో వేద మంత్రోచ్ఛరణ, సంప్రదాయ వాయిద్యాల మధ్య సింహ వాహనంపై కొలువుదీరి శ్రీమఠంలో ఊరేగగా.. భక్తులు తిలకించి మంత్రముగ్ధులయ్యారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో పూర్వారాధనలో భాగంగా

Published : 13 Aug 2022 01:22 IST

ప్రముఖులకు అనుగ్రహ పురస్కారాలు

సంస్థాన పూజలు నిర్వహిస్తున్న పీఠాధిపతి

మంత్రాలయం, న్యూస్‌టుడే:  పూర్వారాధన శుక్రవారం నయనానందకరంగా సాగింది. స్వామి వారు ప్రహ్లాదరాయల రూపంలో వేద మంత్రోచ్ఛరణ, సంప్రదాయ వాయిద్యాల మధ్య సింహ వాహనంపై కొలువుదీరి శ్రీమఠంలో ఊరేగగా.. భక్తులు తిలకించి మంత్రముగ్ధులయ్యారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో పూర్వారాధనలో భాగంగా గ్రామ దేవత మంచాలమ్మ, ప్రహ్లాదరాయలు, రాఘవేంద్రస్వామి మూల బృందావనం, పూర్వ పీఠాధిపతుల బృందావనాలకు సంస్థాన పూజలు జరిపారు. బంగారు మండపంలో మూలరాములు, దిగ్విజయరాములు, జయరాములు, సంతాన గోపాలకృష్ణ, వైకుంఠవాసు దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు మూలరాముల దర్శనం కల్పించారు. రాత్రి.. పుష్ప, పట్టు వస్త్రాలతో అలంకృతుడైన ప్రహ్లాదుడు రాత్రి సింహ వాహనం, వెండి, బంగారు, నవరత్న రథాలపై ఊరేగారు.
ః యోగీంద్ర వేదికపై పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులును అధికారులు, పండితులు శుక్రవారం ఘనంగా సత్కరించారు. అనంతరం రాఘవేంద్ర అనుగ్రహ పురస్కారాలను రొద్దం ప్రభాకర్‌రావు (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విశ్రాంత డీజీపీ, ప్రస్తుత రాఘవేంద్ర మఠం ఏవో), ఎల్‌.మాధవశెట్టి (మఠం ఏఏవో), న్యూరో సర్జన్‌ డాక్టర్‌ జీఆర్‌ చంద్రశేఖర్‌, హుబ్బళ్లి పట్టణ ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ వీజీ నాడగౌడ, సోమశేఖర్‌ (దాత), బెంగళూరుకు చెందిన విద్వాన్‌ ఎం.రామచార్‌, మైసూరు విద్వాన్‌ సీహెచ్‌.శ్రీనివాసమూర్తిలకు పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు నగదు, ఫల మంత్రాక్షతలు, రాఘవేంద్రస్వామి అనుగ్రహ ప్రసస్థి ప్రదానం చేసి ఆశీర్వదించారు. అనంతరం వేదికపై చెన్నైకి చెందిన విద్వాన్‌ ఆర్‌ గణేష్‌ కర్ణాటక ఓకల్‌, మంగళూరుకు చెందిన నృత్య బృందం శ్రీనివాస కల్యాణం ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది.

అలంకరణలో స్వామి బృందావనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని