logo

బస్సు-లారీ ఢీకొని 15 మందికి గాయాలు

బెంగళూరుకు వెళ్లే కేఎస్‌ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులు గాయపడిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున హిరియూరు తాలూకా జవనగొండన హళ్లి గ్రామం వద్ద జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా

Published : 13 Aug 2022 01:22 IST

హిరియూరు తాలూకా జవనగొండనహళ్లి  వద్ద బస్సు లారీని ఢీకొన్న దృశ్యం

చెళ్లకెర(చిత్రదుర్గం), న్యూస్‌టుడే: బెంగళూరుకు వెళ్లే కేఎస్‌ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులు గాయపడిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున హిరియూరు తాలూకా జవనగొండన హళ్లి గ్రామం వద్ద జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా కుడివైపునకు తిరగడంతో వెనుకవైపు నుంచి వేగంగా వస్తున్న బస్సు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న అభిజిత్‌, రాఘవేంద్ర రెడ్డి, నేత్రావతి తదితరులు తీవ్రంగా గాయపడగా వారిని హిరియూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హిరియూరు గ్రామీణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


భారీగా నగలు, నగదు చోరీ

దొంగతనం చేశాక చెల్లాచెదరైన వస్తువులు

చెళ్లకెర(చిత్రదుర్గం) ,న్యూస్‌టుడే: హిరియూరు పట్టణంలోని లక్ష్మమ్మ నగర్‌లో నివాసముంటున్న ఇంద్రజిత్‌ అనే వ్యక్తి ఇంట్లో గురువారం రాత్రి దొంగలు పడ్డారు. ఇంట్లో దాచిన రూ.4.30 లక్షల నగదు, సుమారు రూ.12 లక్షలు విలువైన 280 గ్రాముల బంగారు నగలను దొంగలు దోచుకొని పరారైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. ఇంద్రజిత్‌ అనారోగ్యంతో బాధపడుచూ చికిత్స కోసరం బెంగళూరుకు వెళ్లడంతో ఈ సంఘటన చోటు చేసుకొంది.


గుర్తుతెలియని మృతదేహం లభ్యం

బళ్లారి: బళ్లారి రైల్వేస్టేషన్‌ పరిధిలోని హగరి- హద్దినగుండు రైల్వేస్టేషన్‌ పరిధిలోని కె.ఎం.221/51-53వ కిలోమీటర్‌ వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి (60) మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని విమ్స్‌కు తరలించారు. మృతుడు సంబంధీకులు ఉంటే రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని