logo

యువతిని నమ్మించి లైంగిక దాడి

నగరంలోని ఓ హోటల్‌లో ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడి కోసం కబ్బన్‌పార్కు పోలీసులు గాలింపు తీవ్రం చేశారు. ఈనెల 6న తమిళనాడుకు చెందిన నిందితుడు రమేష్‌ నగరంలోనే ఉంటున్న తన బంధువుల అమ్మాయిని కబ్బన్‌పార్కుకు రావాలంటూ కబురు పెట్టారు. అతడి మాటలు నమ్మిన యువతి అక్కడికి చేరుకుంది. కొద్దిసేపు మాట్లాడాక తానుంటున్న హోటల్‌కు తీసుకువెళ్లి

Published : 13 Aug 2022 01:22 IST

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : నగరంలోని ఓ హోటల్‌లో ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడి కోసం కబ్బన్‌పార్కు పోలీసులు గాలింపు తీవ్రం చేశారు. ఈనెల 6న తమిళనాడుకు చెందిన నిందితుడు రమేష్‌ నగరంలోనే ఉంటున్న తన బంధువుల అమ్మాయిని కబ్బన్‌పార్కుకు రావాలంటూ కబురు పెట్టారు. అతడి మాటలు నమ్మిన యువతి అక్కడికి చేరుకుంది. కొద్దిసేపు మాట్లాడాక తానుంటున్న హోటల్‌కు తీసుకువెళ్లి, లైంగిక దాడికి పాల్పడి పరారైనట్లు పోలీసులు తెలిపారు. అనారోగ్యం పాలైన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితిని వైద్యులు గుర్తించారు. వారి సూచనలతో గురువారం రాత్రి యువతి తల్లిదండ్రులు కబ్బన్‌పార్కు పోలీసుఠాణాలో ఫిర్యాదు చేశారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని