logo

ప్రియాంక్‌ వ్యాఖ్యల దుమారం

‘రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటూ యువకులు లంచం ఇవ్వాలి.. యువతులు మరో రకంగా సహకరించాలి’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రియాంక్‌ ఖర్గే వివాదస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల జడివానలో తడిచారు. కలబురగిలో శుక్రవారం నిర్వహించిన

Published : 13 Aug 2022 01:22 IST

కలబురిగి, న్యూస్‌టుడే: ‘రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలంటూ యువకులు లంచం ఇవ్వాలి.. యువతులు మరో రకంగా సహకరించాలి’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రియాంక్‌ ఖర్గే వివాదస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల జడివానలో తడిచారు. కలబురగిలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ను అని ప్రకటించుకున్న బొమ్మై- పాలనలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. ప్రభుత్వం అన్ని ఉద్యోగాలనూ తమకు ఇష్టం వచ్చిన ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపించారు. ఈ ప్రభుత్వాన్ని తాను ‘లంచం- మంచం’ ప్రభుత్వమని అనేందుకు సంకోచించనని వ్యాఖ్యానించారు. ఎస్సై నియామకాలకు నిర్వహించిన పరీక్షల్లో అక్రమాలతో మూడు లక్షల మంది అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. అక్రమాలను బయటపెట్టిన తనకు సీఐడీ అధికారులతో నోటీసులు పంపించి బెదిరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని చెప్పారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి సమగ్ర దర్యాప్తునకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts