logo

యోధుడు హత్య

సెలవుపై వచ్చిన కరిసిద్ధప్ప కళసద (25) అనే యోధుడు తన బావమరిది చేతిలో హత్యకు గురయ్యారు. బాదామి తాలూకా నీరలకేరి గ్రామంలో గురువారం రాత్రి అతని బావమరిది సిద్ధనగౌడ దూళప్ప కత్తితో పొడిచి హత్య చేశాడని పోలీసులు తెలిపారు.

Published : 13 Aug 2022 01:22 IST

బాగలకోట, న్యూస్‌టుడే : సెలవుపై వచ్చిన కరిసిద్ధప్ప కళసద (25) అనే యోధుడు తన బావమరిది చేతిలో హత్యకు గురయ్యారు. బాదామి తాలూకా నీరలకేరి గ్రామంలో గురువారం రాత్రి అతని బావమరిది సిద్ధనగౌడ దూళప్ప కత్తితో పొడిచి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. భోజనం చేస్తున్న సమయంలో తన భార్య విద్యతో కరిసిద్ధప్ప గొడవ పడ్డాడని వివరించారు. ఆమె తన సోదరునికి ఫోన్‌ చేసి.. భర్తపై ఫిర్యాదు చేసింది. కత్తి తీసుకొచ్చిన నిందితుడు అతన్ని పొడవడంతో తీవ్రంగా గాయపడి మరణించారని తెలిపారు.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts