logo

కాంగ్రెస్‌.. అమృత మహోత్సాహం

నగరంలో గతంలో ఎన్నడూలేని విధంగా జరిగే స్వాతంత్య్ర అమృత మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేపీసీసీ అధ్యక్షుడు డీకేశివకుమార్‌ పిలుపు నిచ్చారు. ఇప్పటి వరకు కార్యక్రమంలో పాల్గొనేందుకు 90 వేల మంది తమ

Published : 15 Aug 2022 02:48 IST

జాతీయ జెండా చేతపట్టి కార్యకర్తలతో కలిసి నడుస్తున్న సిద్ధరామయ్య

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: నగరంలో గతంలో ఎన్నడూలేని విధంగా జరిగే స్వాతంత్య్ర అమృత మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేపీసీసీ అధ్యక్షుడు డీకేశివకుమార్‌ పిలుపు నిచ్చారు. ఇప్పటి వరకు కార్యక్రమంలో పాల్గొనేందుకు 90 వేల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. ఆదివారం ఎంజీరోడ్డులో మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యతో కలిసి పువ్వులు వేశారు. అనంతరం ట్రినిటి కూడలి నుంచి మహాత్మాగాంధీ విగ్రహం వరకు 3.3 కిలోమీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. జెండాను పట్టుకుని డీకేశివకుమార్‌, కార్యాధ్యక్షుడు సలీం అహ్మద్‌, యువజన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్‌, రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్‌ నలపాడ్‌ తదితరులు జాతాలో నడిచారు. కొంతసేపు సిద్ధరామయ్య జాతీయ జెండా చేతులో పట్టుకుని కార్యకర్తలతో కదిలారు. నగరంలో జరిగే స్వాతంత్య్ర అమృత మహోత్సవ కార్యక్రమానికి పార్టీలు రాజకీయాలకు అతీతంగా ప్రజలు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

జాతీయ జెండాతో ర్యాలీలో పాల్గొన్న డీకేశివకుమార్‌, యువజన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్‌, రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్‌ నలపాడ్‌, తదితరులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని