logo

ప్రగతి సాధనకు కంకణం

దేశమంతా 75 ఏళ్ల స్వాతంత్య్ర అమృత మహోత్సవ ఘట్టాన్ని ఆచరించేందుకు సకలం సిద్ధం చేసుకుంది. మూడు రోజులుగా ప్రతి ఇల్లూ త్రివర్ణ పతాకాలతో శోభాయమానంగా వెలుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కోటికి పైగా పతాకాలను వితరణ చేసింది. ఈ స్వాతంత్య్ర

Published : 15 Aug 2022 02:48 IST
25 ఏళ్ల భవిష్యత్తు ప్రణాళికతో సర్వతోముఖాభివృద్ధి
స్వాతంత్య్ర వజ్రోత్సవాలతో నేడు శ్రీకారం
ఈనాడు, బెంగళూరు

దేశమంతా 75 ఏళ్ల స్వాతంత్య్ర అమృత మహోత్సవ ఘట్టాన్ని ఆచరించేందుకు సకలం సిద్ధం చేసుకుంది. మూడు రోజులుగా ప్రతి ఇల్లూ త్రివర్ణ పతాకాలతో శోభాయమానంగా వెలుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కోటికి పైగా పతాకాలను వితరణ చేసింది. ఈ స్వాతంత్య్ర సముపార్జనలో భాగస్వాములైన జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల త్యాగాలపై ఇంటింటా ప్రచారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన వ్యవస్థలు ఏర్పాటు చేసింది. స్వాతంత్య్ర సమరయోధుల్లో ఒకరైన సంగొళ్లి రాయణ్ణ జయంతి ఉత్సవాలు, అమృత భారతి కరునాడ జాతర, మానెక్‌షా మైదానంలో సంప్రదాయ స్వాతంత్య్ర ఉత్సవ కార్యక్రమాలతో ప్రభుత్వం ఈ ఘనమైన మైలురాయిని ఆచరించేందుకు సన్నాహకాలు చేసింది. నేటితో 75 ఏళ్ల స్వాతంత్య్ర ఘట్టం ముగిసినా 25 ఏళ్ల తర్వాత ఆచరించే వందేళ్ల సంబరానికి రాష్ట్రం మరింతగా ప్రగతి సాధించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. సగటు కన్నడిగుడు కోరుకునే ఆ ప్రగతికి దోహదపడే అంశాలేవో చూద్దాం.

ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికత

కేంద్ర ప్రభుత్వం 5 ట్రిలియన్ల ఆర్థికతను చేరుకోవాలన్న లక్ష్యం మరో 5 ఏళ్లలో సాధ్యమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ లక్ష్యానికి కనీసం ఒక ట్రిలియన్‌ డాలర్ల చేయూత అందిస్తామని ముఖ్యమంత్రి ప్రతి కార్యక్రమంలోనూ హామీ ఇస్తున్నారు. ఈ హామీ నెరవేరడం ఏమంత కష్టం కాదని తాజా రాష్ట్ర ఉత్పాదన సామర్థ్యం చెబుతోంది. రాష్ట్రం రక్షణ, వైమానిక, ఐటీ, అంకుర, వ్యవసాయ, భారీ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఉత్పాదన, ఎగుమతుల్లో 25-30శాతం వాటా, ఎస్‌జీడీపీలో 18 శాతాన్ని ఇప్పటికే చేరుకుంది. ఈ రంగాల్లో 5ఏళ్ల విధానాలను యథావిధిగా అమలు చేసినా ట్రిలియన్‌ డాలర్లను 2025నాటికి చేరుకోగలదు.

రైతు ఆదాయం ద్విగుణీకృతం

వ్యవసాయ రంగంలో రాష్ట్ర లక్ష్యం రానున్న 25 ఏళ్లలో రాష్ట్రాన్ని స్వావలంబన వ్యవసాయ క్షేత్రంగా మార్చగలదు. 2019లో రైతు వార్షిక ఆదాయం రూ.96వేలుగా ఉండగా రాష్ట్రం ఇటీవల ప్రకటించిన డబ్లింగ్‌ ఫార్మర్‌ ఇన్‌కం (డీఎఫ్‌ఐ) విధానం 2024 నాటికి ఆ ఆదాయాన్ని రూ.3లక్షలకు చేర్చగలదు. ఇందు కోసం అనుబంధ వ్యవసాయ (సెకండరీ అగ్రి ప్రొడక్ట్స్‌) ఉత్పత్తులు, పాలీహౌస్‌, ఏటవాలు వ్యవసాయ విధానం, రాష్ట్రవ్యాప్తంగా 2వేల ఫుడ్‌పార్కులు, శూన్య పెట్టుబడి వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తులకు బ్రాండింగ్‌, మార్కెటింగ్‌, ప్రతి జిల్లాకు శీతల గిడ్డంగులు వంటి వినూత్న పథకాలు రైతుల ఆదాయాన్ని ద్విగుణీకృతం చేయగలదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని