logo

పాముకాటుతో వ్యక్తి మృతి

హొసదుర్గం తాలూకా అయ్యనహళ్లి గ్రామానికి చెందిన సురేశ్‌ (32) అనే యువకుడు ఆదివారం ఉదయం తన పొలంలో గడ్డిని కోస్తుండగా పాము కాటు వేసింది. తీవ్ర అనారోగ్యానికి గురవడంతో అతన్ని హొసదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా

Published : 15 Aug 2022 02:48 IST

చెళ్లకెరె (చిత్రదుర్గం), న్యూస్‌టుడే : హొసదుర్గం తాలూకా అయ్యనహళ్లి గ్రామానికి చెందిన సురేశ్‌ (32) అనే యువకుడు ఆదివారం ఉదయం తన పొలంలో గడ్డిని కోస్తుండగా పాము కాటు వేసింది. తీవ్ర అనారోగ్యానికి గురవడంతో అతన్ని హొసదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. హొసదుర్గం పోలీసు ఠాణాలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


చికిత్స పొందుతూ యువకుడి దుర్మరణం

చెళ్లకెరె (చిత్రదుర్గం), న్యూస్‌టుడే : చెళ్లకెరె - హిరియూరు రహదారిలో సాణికెరె గ్రామం వద్ద శనివారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని, లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహన చోదకుడు విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా అప్పేనహళ్లి గ్రామానికి చెందిన సచిన్‌ (25) తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం చెళ్లకెరె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. చెళ్లకెరె పోలీసు ఠాణాలో కేసు నమోదైంది.

 


మనస్తాపంతో వ్యక్తి బలవన్మరణం

చెళ్లకెరె (చిత్రదుర్గం), న్యూస్‌టుడే : మూత్రపిండాల వైఫల్యంతో తీవ్ర అనారోగ్యానికి గురైన హిరియూరుకు చెందిన బసవరాజ్‌ (50) అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం రాత్రి జరిగినట్లు పోలీసులు తెలిపారు. పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నా నయం కాకపోవడంతో ఆయన మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హిరియూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


విద్యుదాఘాతంతో దంపతుల మృతి

దావణగెరె, న్యూస్‌టుడే: దావణగెరె జిల్లా బావియాళు గ్రామంలో విద్యుదాఘాతంతో వీణ (30), ఆమె భర్త రవిశంకర్‌ (38) ఆదివారం కన్నుమూశారు. ఉతికిన దుస్తుల్ని ఆరవేసేందుకు రవిశంకర్‌ వెళ్లిన సమయంలో విద్యుత్తు తీగ తాకి, షాక్‌ కొట్టింది. భర్తను రక్షించేందుకు వెళ్లి ఆమె కూడా విద్యుదాఘాతంతో మరణించింది. మాయకొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని