logo

405 అడుగుల ధ్వజస్తంభం సిద్ధం

దేశంలోనే అతి ఎత్తైన 405 అడుగుల ధ్వజస్తంభం నిర్మాణం పనులు తాలూకా క్రీడా మైదానంలో ఆదివారం మధ్యాహ్నం పూర్తయ్యాయి. గురువారమే 350 అడుగుల నిర్మాణం పనులు పూర్తయ్యాయి. కానీ అప్పటినుంచి విపరీతంగా ఈదురు గాలులు వీయడంతో

Updated : 15 Aug 2022 04:42 IST

హొసపేటె, న్యూస్‌టుడే : దేశంలోనే అతి ఎత్తైన 405 అడుగుల ధ్వజస్తంభం నిర్మాణం పనులు తాలూకా క్రీడా మైదానంలో ఆదివారం మధ్యాహ్నం పూర్తయ్యాయి. గురువారమే 350 అడుగుల నిర్మాణం పనులు పూర్తయ్యాయి. కానీ అప్పటినుంచి విపరీతంగా ఈదురు గాలులు వీయడంతో మరో 55 అడుగుల స్తంభాలను అమర్చడం సవాలుగా మారింది. శుక్ర, శనివారాల్లో పనులు జరగలేదు. ఆదివారం ఉదయం ఈదురు గాలుల తగ్గడంతో నిపుణులైన కార్మికులు మొత్తం ధ్వజస్తంభం నిర్మాణ పనులు పూర్తి చేశారు. మంత్రి ఆనంద్‌సింగ్‌ పనులను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘భారతమాత ఆశీర్వాదం వల్ల పనులు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 9 గంటలకు స్తంభంలో జెండా ఎగురువేస్తాం’ అని అన్నారు. రాత్రివేళ కూడా ధ్వజస్తంభం కనిపించేలా దానిచుట్టూ విద్యుద్దీపాల అలంకరణ చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని