logo

వణికిస్తున్న చలిపులి

గతవారం వరకు వణుకు పుట్టించిన వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా.. నదుల్లో వరద తీవ్రత తగ్గనేలేదు. పలు ప్రాంతాల్లో చలి పెరిగింది. కొన్ని చోట్ల వరద ప్రవాహం కొనసాగుతోంది. బెళగావి, హాసన, శివమొగ్గ, చిక్కమగళూరు తదితర ప్రాంతాల్లో మరికొన్నాళ్లు

Published : 17 Aug 2022 02:47 IST

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : గతవారం వరకు వణుకు పుట్టించిన వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా.. నదుల్లో వరద తీవ్రత తగ్గనేలేదు. పలు ప్రాంతాల్లో చలి పెరిగింది. కొన్ని చోట్ల వరద ప్రవాహం కొనసాగుతోంది. బెళగావి, హాసన, శివమొగ్గ, చిక్కమగళూరు తదితర ప్రాంతాల్లో మరికొన్నాళ్లు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మహారాష్ట్ర జలాశయాల నుంచి వస్తున్న వరదతో ఘటప్రభ నదిలో ప్రవాహం ఎక్కువైంది. అన్ని జలాశయాల్లో నీరు నిండుగా ఉండడం, కాలువలకు నీటిని వదలడంతో సేద్యం పనులు జోరుగా మొదలయ్యాయి. ఇప్పటికే పంట నష్టపోయిన రైతులు మళ్లీ సేద్యం చేసుకునేందుకు అనుగుణంగా పొలాలను శుభ్రం చేసుకోవడం కనిపించింది. వర్షాలకు కొట్టుకుపోయిన రహదారుల పనులను ప్రజాపనుల శాఖ వేగవంతం చేసింది. బెళగావి, బాగల్‌కోటె జిల్లాల పరిధిలో ఘటప్రభ నది భయంగొలిపేలా ప్రవహిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని