logo

బడుగు సేవకులపై పిడుగులా?

ప్రభుత్వం తమపై కక్ష పూరితంగా వ్యవహరిస్తూ విధుల నుంచి తొలగిస్తోందని మధ్యాహ్న భోజన తయారీ కార్యకర్తలు ఆరోపించారు.

Published : 17 Aug 2022 02:47 IST

స్వాతంత్య్ర ఉద్యానవనంలో నినాదాలు చేస్తున్న ఆందోళనకారులు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : ప్రభుత్వం తమపై కక్ష పూరితంగా వ్యవహరిస్తూ విధుల నుంచి తొలగిస్తోందని మధ్యాహ్న భోజన తయారీ కార్యకర్తలు ఆరోపించారు. సీఐటీయూ సహకారంతో స్వాతంత్య్ర ఉద్యానవనంలో కార్యకర్తలు మంగళవారం నిర్వహించిన ధర్నాలో అన్ని జిల్లాల నుంచి కదలివచ్చిన అక్షర దాసోహ కార్యకర్తలు పాల్గొన్నారు. కనీస వేతనాలకు పని చేస్తున్న తమను బలవంతంగా విధుల నుంచి తప్పించడం దారుణమని అన్నారు. పదవీ విరమణ వయస్సును 60 నుంచి మరో రెండేళ్లకు పెంచాలని, పదవీ విరమణ చేసిన సమయంలో రూ.ఒక లక్ష గౌరవ ధనాన్ని అందించడంతో పాటు పింఛను, వైద్య సదుపాయాలను కల్పించాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని