logo

వర్ణరంజితం.. సాంస్కృతికోత్సవం

పంద్రాగస్టు సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి తాలూకా క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన విజయనగర వైభవ సాంస్కృతిక కార్యక్రమాలు రంజింపజేశాయి. బెంగళూరు నుంచి వచ్చిన స్థానిక కళాకారులు సంప్రదాయ నృత్యం, దేశభక్తి గేయాలతో అలరించారు.

Published : 17 Aug 2022 02:47 IST

విజయనగర వైభవ కార్యక్రమంలో దేశభక్తిపై నృత్యప్రదర్శన చేస్తున్న కళాకారులు

హొసపేటె, న్యూస్‌టుడే: పంద్రాగస్టు సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి తాలూకా క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన విజయనగర వైభవ సాంస్కృతిక కార్యక్రమాలు రంజింపజేశాయి. బెంగళూరు నుంచి వచ్చిన స్థానిక కళాకారులు సంప్రదాయ నృత్యం, దేశభక్తి గేయాలతో అలరించారు. మా తుజే సలామ్‌, వందే మాతరం గేయాల నృత్యంలో కళాకారులు ఆకట్టుకున్నారు. విజయనగర వైభవాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించటానికి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి ఆనంద్‌సింగ్‌ పేర్కొన్నారు. కార్యక్రమాలు విజయవంతానికి కృషి చేసిన పలువురిని ఆయన సన్మానించారు. హంపీ స్మారకాల ఛాయాచిత్రాలను తీసి, సామాజిక మాధ్యమాల ద్వారా దేశ, విదేశీయులకు పరిచయం చేస్తున్న హొసపేటె ఛాయాచిత్రకారుడు శివశంకర్‌ బణగార్‌ను సన్మానించారు. కార్యక్రమంలో పాలనాధికారి పి.అనిరుద్ధ్‌ శ్రవణ్‌, ఎస్పీ డాక్టర్‌ కె.అరుణ్‌, జిల్లా పంచాయతీ సీఈవో హర్షల్‌ బోయర్‌, తదితరులు పాల్గొన్నారు.
* వాల్మీకి మహిళ కళా సంస్థ నుంచి: వాల్మీకి మహిళ కళాసంస్థ, కన్నడ, సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా ఆదివారం రాత్రి తాలూకాలోని నాగేనే హళ్లిలో స్వాతంత్య్ర మహోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కళాకారులు మల్లికార్జున తురువనూరు, అంగడి వామదేవ, యల్లప్పనవర్‌, వసంత్‌కుమార్‌, రేణుకా, కావ్యాబాయిలనుంచి నృత్య, సంగీత, గేయాలాపన కార్యక్రమాలు జరిగాయి. సంస్థ అధ్యక్షురాలు అనురాధ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని