logo

వేదనతో ఇక బతకలేమని..

పచ్చని కుటుంబం కడతేరిపోయింది. అనారోగ్యం పట్టిపీడించిన ఆనవాళ్లే దీనికంతటికీ కారణంగా గుర్తించారు. రాజధాని నగరంలోని కోణనకుంటె పరిధి చుంచనకట్టె ఎస్‌బీఐ లేఅవుట్లో ఉంటున్న మహేశ్‌ అనే వ్యక్తి

Published : 19 Aug 2022 04:44 IST

భార్య, కుమారునితో మహేశ్‌

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : పచ్చని కుటుంబం కడతేరిపోయింది. అనారోగ్యం పట్టిపీడించిన ఆనవాళ్లే దీనికంతటికీ కారణంగా గుర్తించారు. రాజధాని నగరంలోని కోణనకుంటె పరిధి చుంచనకట్టె ఎస్‌బీఐ లేఅవుట్లో ఉంటున్న మహేశ్‌ అనే వ్యక్తి తన భార్య జ్యోతి, కుమారుడు నందీశ్‌ గౌడతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డారు. బెంగళూరు పాలికెలో ఒప్పంద కార్మికునిగా పని చేస్తున్న ఆయన మళవళ్లికి చెందినవారు. బెంగళూరులో స్థిరపడ్డారు. మహేశ్‌ ఉరి వేసుకోగా, భార్య, కుమారుడు విషం తాగి మరణించారు. అనారోగ్యంతోనే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని బలవన్మరణానికి ముందుగా బాధితుడు రాసిన లేఖను కోణనకుంట పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. వారం రోజులుగా కడుపునొప్పి ఎక్కువగా ఉందని మహేశ్‌ విధులకు హాజరు కావడం లేదని సహోద్యోగులు చెప్పారు. వైద్య పరీక్షల్లో క్యాన్సర్‌ ఉందని గుర్తించడంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. కోణనకుంటె పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను కిమ్స్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని