logo

సిద్ధును భాజపాలోకి ఆహ్వానిస్తా

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత సిద్ధరామయ్య సొంత పార్టీలోనే కష్టాలు అనుభవిస్తున్నారు. మా పార్టీలోకి ఆహ్వానించి వెనకబడిన వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకొని రావడానికి ఆయనతో మాట్లాడతాను. దీనికి వేర్వేరు అర్థాలు

Published : 19 Aug 2022 04:44 IST

మంత్రి శ్రీరాములు వెల్లడి

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బి.శ్రీరాములు, చిత్రంలో శాసనసభ్యుడు తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత సిద్ధరామయ్య సొంత పార్టీలోనే కష్టాలు అనుభవిస్తున్నారు. మా పార్టీలోకి ఆహ్వానించి వెనకబడిన వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకొని రావడానికి ఆయనతో మాట్లాడతాను. దీనికి వేర్వేరు అర్థాలు సృష్టించే అవసరం లేదని రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమ శాఖ, జిల్లా బాధ్య మంత్రి బి.శ్రీరాములు స్పష్టం చేశారు. నగరంలో గురువారం అభివృద్ధి పనుల్లో పాల్గొన్న మంత్రి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీలో డి.కె.శివకుమార్‌, ఇతర నేతల నుంచి ఇబ్బందులు పడుతున్న కారణంతోనే సిద్ధరామయ్యను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంపై రాష్ట్ర అధ్యక్షుడికి ఏమి చెప్పాలో చెప్పడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్ప పార్టీలో బలమైన నేత..పార్టీ, రాష్ట్ర ప్రజలకు జీవితం త్యాగం చేశారు. మొదటి నుంచి యడియూరప్ప, కె.ఎస్‌.ఈశ్వరప్ప పార్టీని బలపరచడానికి శ్రమించారు. నాకు ఈ స్థానం లభించడానికి యడియూరప్ప కారణమన్నారు. ప్రస్తుతం బి.ఎస్‌.యడియూరప్పకు కేంద్రంలో ఉన్నత స్థానం కల్పించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ, కార్యకర్తలకు ఏనుగంత బలం వచ్చింది. రెండు స్థానాల నుంచి 120 స్థానాలను గెలిపించారని గుర్తు చేశారు.విధానసభ ఎన్నికల్లో సామూహిక నాయకత్వంలో బి.ఎస్‌.యడియూరప్ప, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై మార్గదర్శనంలో ఎన్నికలను ఎదుర్కొంటామన్నారు. సమావేశంలో శాసనసభ్యుడు గాలి సోమశేఖర్‌రెడ్డి, బుడా అధ్యక్షుడు పి.పాలన్న, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని