logo

ఉన్నత విద్యవైపు అడుగేయాలి

వృత్తి విద్య (పాలిటెక్నిక్‌) కోర్సులు పూర్తి చేసి బయటకు వెళ్తున్న విద్యార్థులు..ఉన్నత చదువులవైపు అడుగులు చేయాలని బళ్లారి విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డా.సి.శంకరగౌడ పాటీల్‌ సూచించారు. బళ్లారి

Published : 19 Aug 2022 04:44 IST

డిగ్రీ పట్టాలు పొందడానికి సిద్ధంగా ఉన్న విద్యార్థులు

బళ్లారి, న్యూస్‌టుడే: వృత్తి విద్య (పాలిటెక్నిక్‌) కోర్సులు పూర్తి చేసి బయటకు వెళ్తున్న విద్యార్థులు..ఉన్నత చదువులవైపు అడుగులు చేయాలని బళ్లారి విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డా.సి.శంకరగౌడ పాటీల్‌ సూచించారు. బళ్లారి నగరం కంటోన్మెంట్‌ ప్రాంతంలోని హనగల్‌ శ్రీ కుమారేశ్వర పాలిటెక్నిక్‌ తాంత్రిక విద్యాలయంలో గురువారం గ్రాడ్యుయేషన్‌ డేను రిజిస్ట్రార్‌ ప్రారంభించారు. కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఎంత ఎత్తుకు ఎదిగినా..తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలన్నారు. ఉద్యోగంలో స్థిరపడే భావన కంటే..ఉద్యోగాలు సృష్టించే స్థాయికి చేరుకోవాలన్నారు. విమ్స్‌ బాధ్య సంచాలకుడు డా.గంగాధరగౌడ మాట్లాడుతూ తాను వీరశైవ విద్యావర్ధక సంఘం విద్యా సంస్థల్లో కన్నడ మాధ్యమంలో చదివి ఈ స్థాయికి చేరుకున్నట్లు వివరించారు. నేర్చుకోవడానికి భాష ముఖ్యం కాదు..మనసు ముఖ్యమన్నారు. ప్రతి విద్యార్థి ప్రాథమిక దశ నుంచే అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి శ్రమించాలి. అప్పుడే జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులు సంతోషంగా ఉంటారని తెలిపారు. వి.వి.సంఘం కార్యదర్శి బి.వి.బసవరాజ్‌, కళాశాల అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌ మాట్లాడారు. అనంతరం తాంత్రిక విద్యా పూర్తి చేసిన విద్యార్థులకు ప్రమాణ పత్రాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ప్రధాన ఆచార్యులు టి.ఎం.వీరగంగాధరస్వామి, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

మాట్లాడుతున్న బళ్లారి వీఎస్కేయూ రిజిస్ట్రార్‌ డా.సి.శంకరగౌడ పాటీల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని