logo

శారదాంబకు జ్ఞానవాపి వస్త్రాభరణం

మంగళూరు రథం వీధిలోని శ్రీ వేంకటరమణ దేవాలయం ఆచార్య మఠం ఆవరణలోని శారదోత్సవాల కోసం ప్రత్యేకంగా నేయించిన చీర నగరానికి చేరుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జ్ఞానవాపికి చెందిన నూరుల్లా అమీన్‌ తన నలుగురు కుటుంబ

Published : 25 Sep 2022 03:12 IST

బంగారు జరీ ఉన్న చీర

మంగళూరు, న్యూస్‌టుడే : మంగళూరు రథం వీధిలోని శ్రీ వేంకటరమణ దేవాలయం ఆచార్య మఠం ఆవరణలోని శారదోత్సవాల కోసం ప్రత్యేకంగా నేయించిన చీర నగరానికి చేరుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జ్ఞానవాపికి చెందిన నూరుల్లా అమీన్‌ తన నలుగురు కుటుంబ సభ్యులతో కలిసి రూ.8 లక్షల విలువైన చీరను నేశారు. నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేకంగా శారదా మాతకు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుండగా, ఈ ఏడాది శతమానోత్సవాలను నిర్వహిస్తున్నారు. మంగళూరులోని కుల్యాడికర్‌ చీరల దుకాణం యజమాని 1988 నుంచి ఏటా అమ్మవారికి రూ.2 లక్షల విలువైన చీరను ఇచ్చేవారు. ఈసారి శతమానోత్సవాల నేపథ్యంలో ఆయన రూ.8 లక్షల నగదు ఇవ్వగా.. వారణాసికి చెందిన నూరుల్లా ఆ చీర సిద్ధం చేశారు. చీరపై 2600 బంగారు పుష్పాలను జరీతో అల్లారు. చీర కోసం 88 గ్రాముల బంగారం, 700 గ్రాముల వెండిని ఉపయోగించారని మఠం ప్రతినిధులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని