logo

బరితెగించిన రౌడీషీటర్లు

మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దుల్లో హొన్నాళ్లిలో పొలాల మధ్య జరుగుతున్న గంజాయి సాగును అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై సంతోష్‌ అనే రౌడీషీటరు మద్దతుదారులైన 40 మంది దాడి చేశారు. ఇప్పటికే అరెస్టు చేసిన సంతోష్‌ను విడుదల చేయకపోతే

Published : 25 Sep 2022 03:12 IST

శ్రీమంత ఇల్లాళ

కలబురగి, న్యూస్‌టుడే : మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దుల్లో హొన్నాళ్లిలో పొలాల మధ్య జరుగుతున్న గంజాయి సాగును అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై సంతోష్‌ అనే రౌడీషీటరు మద్దతుదారులైన 40 మంది దాడి చేశారు. ఇప్పటికే అరెస్టు చేసిన సంతోష్‌ను విడుదల చేయకపోతే దాడులు కొనసాగిస్తామని నిందితులు హెచ్చరించారు. ఘటనలో కమలాపుర ఠాణా ఇన్‌స్పెక్టర్‌ శ్రీమంత ఇల్లాళ తీవ్రంగా గాయపడ్డారు. బసవకల్యాణ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం ఆయనను కలబురగి యునైటెడ్‌ ఆసుపత్రికి తరలించారు. శ్రీమంత ఆరోగ్య పరిస్థితులను ఎస్పీ ఇషాపంత్‌ శనివారం స్వయంగా తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నిందితుల దాడిలో గాయపడిన మరికొందరు పోలీసు సిబ్బంది బసవకల్యాణలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇన్‌స్పెక్టర్‌కు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని, ఎయిర్‌ లిఫ్ట్‌ చేసి బెంగళూరుకు పంపించాలని కురుబ సముదాయానికి చెందిన కార్యకర్తలు కలబురగిలో శనివారం ధర్నాకు దిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని