logo

యువ వేదిక సిద్ధం

మహారాజ కళాశాలలో మంగళవారం నుంచి అక్టోబరు మూడో తేదీ వరకు యువ దసరా వేడుకల కోసం ప్రత్యేక వేదిక నిర్మాణం పూర్తయింది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎస్‌.టి.సోమశేఖర్‌, ప్రముఖ నటుడు కిచ్చ సుదీప్‌ ఈ యువ దసరా వేడుకలు

Published : 25 Sep 2022 03:12 IST

మానస గంగోత్రి వేదికపై శుక్రవారం రాత్రి కొనసాగిన యువ సంభ్రమ ప్రదర్శనలు

మైసూరు, న్యూస్‌టుడే : మహారాజ కళాశాలలో మంగళవారం నుంచి అక్టోబరు మూడో తేదీ వరకు యువ దసరా వేడుకల కోసం ప్రత్యేక వేదిక నిర్మాణం పూర్తయింది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎస్‌.టి.సోమశేఖర్‌, ప్రముఖ నటుడు కిచ్చ సుదీప్‌ ఈ యువ దసరా వేడుకలు ప్రారంభించనున్నారు. దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌కు నివాళిగా బుధవారం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తామని యువ దసరా ఉప సమితి ప్రత్యేక అధికారి ఆర్‌.చేతన్‌ తెలిపారు. కళాకారుడు శ్రీధర్‌ జైన్‌, గాయకులు రఘు దీక్షిత్‌, మంగ్లి తదితరుల ప్రదర్శనలు మొదటి రోజు ఉంటాయని వెల్లడించారు. సెప్టెంబరు 29న లేజర్‌ షో, సిగ్నేచర్‌ గ్రూప్‌ డ్యాన్స్‌, కన్నికా కపూర్‌, అసెంట్‌ బృందాల కార్యక్రమంలో, సెప్టెంబరు 30న స్యాండల్‌వుడ్‌ నైట్‌ కార్యక్రమం ఉంటుందని ఆయన వివరించారు. అక్టోబరు ఒకటిన గాయని శమిత మత్నాడ్‌, 2వ తేదీన పవన్‌ డ్యాన్సర్‌, నటులు హర్షిక పుణచ్చ, విజయ రాఘవేంద్ర, అమిత్‌ త్రివేది, చివరి రోజు సుప్రియా రామ్‌ మహిళా బ్యాండ్‌ బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు, చివరిగా ఫ్యాషన్‌ షో ఉంటుందని చేతన్‌ వెల్లడించారు. వారం రోజులుగా యువ సంభ్రమ వేడుకలను మానసగంగోత్రి ప్రాంగణంలో కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని