logo

రైతులు, మహిళల రుణాల మాఫీకి డిమాండు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఐ నేతృత్వంలో శనివారం బళ్లారి నగరంలో ఆందోళన నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సత్యబాబు, రాష్ట్ర సమితి సభ్యులు గురుశాంత్‌, చంద్రకుమారి నేతృత్వంలో

Published : 25 Sep 2022 03:12 IST

డీసీ కార్యాలయం ముందు ఆందోళనలో పాల్గొన్న కార్యకర్తలు

బళ్లారి, న్యూస్‌టుడే : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఐ నేతృత్వంలో శనివారం బళ్లారి నగరంలో ఆందోళన నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సత్యబాబు, రాష్ట్ర సమితి సభ్యులు గురుశాంత్‌, చంద్రకుమారి నేతృత్వంలో స్థానిక గడిగి చెన్నప్ప కూడలి నుంచి డీసీ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. డీసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సత్యబాబు, గురుశాంత్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, వ్యవసాయ కూలీలు, దళితులు, మహిళలు తీసుకున్న బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని, కేరళలో మాదిరిగా రాష్ట్రంలోనూ రుణ రహితం చేయాలన్నారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలని, ప్రభుత్వాలు కొత్తగా తీసుకొచ్చిన విద్యుత్తు చట్టం, భూస్వాధీన చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండు చేశారు. పేదలు, కార్మికులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ఏళ్ల తరబడి ప్రభుత్వం, అటవీశాఖ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు సాగు పట్టాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల ఏర్పాటుకు తీసుకున్న భూముల్లో వాటిని స్థాపించాలని, పరిశ్రమలు స్థాపించే వరకూ భూములను కోల్పోయిన రైతు కుటుంబాలకు నెలకు రూ.20 వేల ఆర్థిక సహాయం చేయాలని, నిత్యావసర, చమురు, వంట గ్యాస్‌ తదితర ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో తాలూకా సమితి కార్యదర్శులు తిప్పయ్య, గాళి బసవరాజ్‌, సభ్యులు శివశంకర్‌, ఎ.స్వామి, ఓబలేశప్ప, దుర్గమ్మ, ఈరమ్మ, తరంగణి, రుద్రమ్మ, మహమ్మద్‌ఖాన్‌, చెన్న బసయ్య, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని