logo

నటుడు వినయ్‌ రాజ్‌కుమార్‌ సందడి

వరనట డాక్టర్‌ రాజ్‌కుమార్‌ మనవడు, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ పుత్రడు వినయ్‌ రాజ్‌కుమార్‌ శనివారం హొసపేటె వచ్చారు. ఇప్పటి వరకు మూడు చిత్రాల్లో నటించిన ఆయన వచ్చారని తెలియగానే పెద్ద ఎత్తున అభిమానులు ఆయన చుట్టూ చేరారు.

Published : 25 Sep 2022 03:12 IST

హొసపేటెలో పునీత్‌రాజ్‌ కుమార్‌ ప్రతిమకు మాలార్పణ

చేస్తున్న నటుడు వినయ్‌ రాజ్‌కుమార్‌

హొసపేటె, న్యూస్‌టుడే : వరనట డాక్టర్‌ రాజ్‌కుమార్‌ మనవడు, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ పుత్రడు వినయ్‌ రాజ్‌కుమార్‌ శనివారం హొసపేటె వచ్చారు. ఇప్పటి వరకు మూడు చిత్రాల్లో నటించిన ఆయన వచ్చారని తెలియగానే పెద్ద ఎత్తున అభిమానులు ఆయన చుట్టూ చేరారు. తొలుత పట్టణ నడిబొడ్డులో ఉన్న చిన్నాన్న పునీత్‌రాజ్‌ కుమార్‌ ప్రతిమకు మాలార్పణ చేశారు. అనంతరం కొంతసేపు అభిమానులతో సందడి చేశారు. ‘చిన్నాన్న పునీత్‌రాజ్‌ కుమార్‌ ఉత్తర కర్ణాటక ప్రాంతానికి వచ్చినప్పుడల్లా హొసపేటెలోని అభిమానులను కలిసి వెళ్లేవారు. ఈ నేపథ్యంలో హంపీ పర్యటనకు వచ్చిన తను రాజ్‌కుటుంబం అభిమానులను కలవటానికి వచ్చానని అన్నారు. రాజ్‌కుటుంబంపై హొసపేటె ప్రజలకు ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్‌ కుటుంబం మంచి కథలు, నీతి ఉన్న సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. అలాంటి కథలు దొరికితే తప్పకుండా నటిస్తానని అన్నారు. అనంతరం ఆయన హంపీ, ఆనెగుంది వీక్షణకు తరలి వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని