logo

ప్రాణదాతకు.. సాంకేతిక బ్రేకు

రాష్ట్ర వ్యాప్తంగా 108 అంబులెన్సు సేవలు ఆదివారం నిలిచి పోయాయి. పేదలను ఆసుపత్రులకు ఉచితంగా తీసుకు వెళ్లే అంబులెన్సు సేవలను పునరుద్ధరణకు ఒప్పందం...

Published : 26 Sep 2022 03:08 IST

నిలిచిన 108 సేవలు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా 108 అంబులెన్సు సేవలు ఆదివారం నిలిచి పోయాయి. పేదలను ఆసుపత్రులకు ఉచితంగా తీసుకు వెళ్లే అంబులెన్సు సేవలను పునరుద్ధరణకు ఒప్పందం చేసుకున్న సంస్థ చర్యలు చేపట్టిందని ఆరోగ్య శాఖ మంత్రి డా.కె.సుధాకర్‌ తెలిపారు. అంబులెన్సుల నిర్వహణలోని మదర్‌బోర్డు సాఫ్ట్‌వేర్‌లో లోపాలతో ఈ సమస్య ఎదురైందన్నారు. తుమకూరు జిల్లా మధుగిరి తాలూకా ఐడిహళ్లిలో సకాలంలో అంబులెన్సు దొరక్క పోవడంతో జయమ్మ (65) అనే మహిళ మరణించింది. ఉచిత అంబులెన్సు కోసం సహాయవాణి నంబరు 108కు ఫోన్‌ చేసిన రెండు నిమిషాల్లోగా అంబులెన్సును పంపించేందుకు ఆపరేటర్‌ లైన్‌లోకి వచ్చేవారు. ఇప్పుడు ఒక్కో కాల్‌ను ఆపరేటర్‌కు కనెక్ట్‌ చేసేందుకు కనీసం 8-10 నిమిషాల సమయం తీసుకుంటోంది. నిత్యం ఎనిమిదివేల కాల్స్‌ను స్వీకరించవలసి ఉండగా, ప్రస్తుతం రెండు వేల కాల్స్‌ను మాత్రమే తీసుకోగలుగుతున్నారు. ఉచిత సేవలు అందుబాటులో లేకపోవడంతో ఆయా ఆసుపత్రులకు చెందిన అంబులెన్సులను రోగుల కుటుంబ సభ్యులు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 108 కింద 850 అంబులెన్సులు ఉన్నాయి. ఈ సేవలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించే వరకు 104 సేవలు, ప్రైవేటు ఆసుపత్రులు నామమాత్రపు ధరల్లో అంబులెన్సులను అందించాలని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని