logo

మాతంగి కొండ అభివృద్ధికి కృషి

ప్రసిద్ధి చెందిన హంపీలోని మాతంగ కొండ అభివృద్ధికి తనవంతు శాయశక్తులా కృషి చేస్తానని పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌సింగ్‌ పేర్కొన్నారు. మాతంగ కొండ అభివృద్ధి సమితి

Published : 26 Sep 2022 03:08 IST


మాతంగి మహాయజ్ఞ కుండానికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న మంత్రి ఆనంద్‌సింగ్‌

హొసపేటె, న్యూస్‌టుడే : ప్రసిద్ధి చెందిన హంపీలోని మాతంగ కొండ అభివృద్ధికి తనవంతు శాయశక్తులా కృషి చేస్తానని పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌సింగ్‌ పేర్కొన్నారు. మాతంగ కొండ అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో ఆదివారం హంపీలోని మాతంగ కొండలో ఏర్పాటు చేసిన మహాయజ్ఞ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం మాతంగ కొండ ఎక్కేందుకు మెట్లు పూర్తిగా శిథిలమయ్యాయి. వాటి పునర్నిర్మాణానికి రూ.6.5 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అంజనాద్రి కొండపైన ఉన్నంత శ్రద్ధ మాతంగ కొండపైన లేదని వస్తున్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. హంపీలో చిన్న ఇటుక పెట్టాలన్నా యునెస్కో, ప్రాధికారం, పురావస్తు శాఖల ఆంక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో మాతంగ కొండ అందానికి ఎలాంటి విఘాతం కలగకుండా మెట్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఈ కొండ ఎక్కేందుకు ఎంతో ఉత్సాహం చూపుతున్నారన్నారు. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రల నుంచి వచ్చిన భక్తులు, విదేశీయులు అష్టకష్టాలు పడి కొండెక్కి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నామన్నారు. ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండబోవని అన్నారు. అన్ని నియమాలు పాటిస్తూనే కొండ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. మహాయజ్ఞానికి ముందు విరూపాక్ష ఆలయం నుంచి మాతంగ కొండవరకు అమ్మవారి ఉత్సవ మూర్తి ఊరేగింపు జరిగింది. కలశ, కుంభాలతో మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రముఖులు వీరస్వామి, బసవరాజ్‌, రాజశేఖర్‌ హిట్నాళు, భరత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


కలశ, కుంభాలతో హంపీ విరుపాక్ష వీధిలో మహిళల ఊరేగింపు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు